December 29, 2019

తల్లి.. తల్లి... నా చిట్టి తల్లి

తల్లి.. తల్లి... నా చిట్టి తల్లి
బేవార్స్ (2018)
సునీల్ కశ్యప్

తల్లి.. తల్లి... నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా.....
నువ్వే.. లేని.. లోకాన నేను...
శవమల్లే మిగిలా..నమ్మా....అఅ ఆఆ.

నా ఇం..ట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ
ప్రతి రోజు మురిసేనమ్మా.....ఆఆ..
ఏ జన్మలో పాపమేనేను చేశానో
ఈ శిక్షే వేశావమ్మా......
తల్లి.. తల్లి..నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా.....
నీవే.. లేని.. లోకాన నేను...
శవమల్లే మిగిలా..నమ్మా....
ఓఓఒ..ఓఓఓ..ఓ
ఓఓఒ..ఓఓఓ..ఓ
ఓ......

చరణం1

పొద్దున్నే పొద్దల్లే నువ్ నా..కు ఎదురైతే
అదృష్టం నాదనుకున్నా.....
సాయంత్రం వేళల్లో నా బ్రతుకు నీడల్లో
నా దీపం నీవనుకున్నా...

నా వెలుగంత తీసు కెళ్లి....
ఏ చీకట్లో కలిపేశావే...
నా ఆశల్ని మోసుకెళ్లి....
ఏ చితిలోన కాల్చేశావే.....

తల్లి.. తల్లి... నా చిట్టి తల్లి
నా ప్రా-ణా-లే- పోయా-యమ్మా.....
నీవే.. లేని.. లోకా..న నేను...
శవమల్లే మిగిలా..నమ్మా

చరణం2

లోకంలో నేనింకా ఏకాకినైనట్టు
శూన్యంలో ఉన్నానమ్మా....
చిరు గాలిలో ఊగే ఏ చిగురు కొమ్మయిన
నీలాగే తోచేనమ్మా...
నీ నిశ్శబ్దం నా గుండెల్లో....
జల పా..త మయ్యిందమ్మా
ఆ నీలి ఆకాశంలో
ఏ నక్షత్రం అయ్యావమ్మా....
తల్లి.. తల్లి... నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా.....
నీవే.. లేని.. లోకా..న నేను.
శవమల్లే మిగిలా..నమ్మా....