రావే రాధా రాణీ

రావే రాధా రాణీ
చిత్రం : శాంతినివాసం (1960)
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల , జిక్కి

రావే రాధా రాణీ రావే
రాధ నీవే కృష్ణుడ నేనే
రమ్యమైన శారద రాత్రి రాస లీలా వేళ ఇదే
రాస లీలా వేళ ఇదే
రార కృష్ణా రారా కృష్ణా
రాధ నేనే కృష్ణుడ నీవే
రమ్యమైన శారద రాత్రి రాస లీలా వేళ ఇదే
రాస లీలా వేళ ఇదే

వంపులతో సొంపమరీ ఇంపొసగే యమునేదీ
సుందరి నీ వాలుజడే సొగసైన ఆ యమునా

హోయ్ ..నేటి తార కోర్కెలు నేనే
నాటి పున్నమ జాబిలి నీవే
రాధ నేనే కృష్ణుడ నీవే
రాస లీలా వేళ ఇదే
రాస లీలా వేళ ఇదే

విరిసిన పూపొదలేవీ..విరివనిలో విభుడేడీ
వికసించే నీ కనులా ..వెలిగేనే నీ విభుడు

హోయ్ ..మూగబోయే మానస మురళీ
మురిసి మ్రోగే మోహన రవళీ
రాధ నీవే కృష్ణుడ నేనే
రాస లీలా వేళ ఇదే
రాస లీలా వేళ ఇదే
దేవి రాధా మాధవ లీలా ..పావనమ్ము బృందావనము
మనము రాధా కృష్ణులమేలే మధురమాయే ఈ వనము
మధురమాయే ఈ వనము
ఆహా హ హ హ
ఓహో హొ హొ ఒహోహో
ఊహూ హు హు హు
ఊహూ హు హు హు
ఊహూ హు హు హు