December 22, 2019

పసివాడో ఏమిటో

పసివాడో ఏమిటో
చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో...?

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు

తాళెరుగనీ తల్లొక్కరు
తోడెరుగనీ  మోడొక్కరు
కొడుకుండీ తండ్రవలేక
సతులుండీ పతి కాలేక
తన తలరాతకు తలవంచి
శిలలాగే బ్రతికేదొకరు

బంధాలే సంకెళ్లు వేయగా
బ్రతుకంతా చెరసాల లాగ మారగా

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు

చేజేతులా ఏ ఒక్కరు
ఏ నేరమూ చేసెరగరు
తెలిసెవరూ దోషులు కారు
ఫలితం మాత్రం మోశారు
పరులంటూ ఎవరూ లేరు
ఐనా అంతా పగవారు

ఇకనైనా ఈ మంటలారునా
ఇకనైనా ఈ జంట చెంత చేరునా

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు ఆ...