జానపద బ్రహ్మ మనాప్రగడ నరసింహమూర్తి గారు అద్భుతంగా గానం చేసిన హుషారైన జానపద గీతం “అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు” తర్వాత్తర్వాత చాలా మార్పులు చెంది పలుచోట్ల పలు రూపాలు సంతరించుకొంది. అందులో ఒక జానపదం ఇక్కడ ఇస్తున్నాను.
పల్లవి :
అంతే నాకు చాలు.. తమలపాకు తొడిమే పదివేలు . .
అందరిలాగ అడిగేదాన్ని కాను.. కొ౦దరిలాగ కొసరేదాన్ని కాను
మావా

చరణం 1 :
ముక్కూకు ముక్కెర లేక ముక్కు చిన్నబోయినాది..
ముక్కూకు ముక్కెర లేక ముక్కు చిన్నబోయినాది
ముగ్గురూ చెల్లెళ్ళనమ్మి ముక్కుకే ముక్కెర తేరా
చరణం 2 :
నడుమూకొడ్డాణ౦ లేక నడుమూ చిన్నబోయినాది..
నడుమూకొడ్డాణ౦ లేక నడుమూ చిన్నబోయినాది..
నలుగురూ తమ్ముళ్ళనమ్మి నడుముకే ఒడ్డాణ౦ తేరా
చరణం 3 :
కాళ్లా కడియాలు లేక.. కాళ్ళు చిన్నబోయినాయి..
కాళ్లా కడియాలు లేక.. కాళ్ళు చిన్నబోయినాయి
ఖజాన లోని పైసలు తీసి కాళ్లకే కడియాలు తేరా..
చరణం 4 :
పట్టెమంచం, పరుపు లేక.. మనసూ చిన్నబోయినాది
పట్టెమంచం పరుపు లేక.. మనసూ చిన్నబోయినాది..
పాడి, యెద్దుల్నమ్ముకోని .. పట్టెమంచం పరుపే తేరా