"దానవీరశూర కర్ణ" చిత్రం లోని “అస్త్ర విద్యా పరీక్ష ఘట్టము” తదితర పద్యాలు
అస్త్ర విద్యా పరీక్ష ఘట్టము
ద్రోణ: నీ కులము
కర్ణ: నేను సూతుడను...సూత కులము.
ద్రోణ : సూతకుల సంజాతులు... పూతకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హులు
దుర్యోధనుడు:-
(కర్ణుడిని ఉద్దేశించి)
ఆగాగు!
(ద్రోణుడిని ఉద్దేశించి)
ఆచార్యదేవా! హహ్హహ్హహ్హహ్హహ్హహ్హ
ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున
సూత సుతునకిందు నిలువ అర్హతలేదందువా !
ఎంత మాట, ఎంత మాట !
ఇదిక్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ?
కాదు, కాకూడదు, ఇది కులపరీక్షయే అందువా !
నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది?
అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?
మట్టి కుండలో పుట్టితివికదా!
హహ్హహ్హ...
నీది ఏకులము?
ఇంత ఏల? అస్మత్పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు
శివసముద్రుల భార్యయగు గంగా గర్భమునజనిoచలేదా!
ఈయనదేకులము ?
నాతో చెప్పింతువేమయ్యా...
మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు
దేవవేశ్యయగు ఊర్వశీ పుత్రుడు కాడా?
ఆతడు పంచమజాతి కన్యయైన అరుంధతియందు శక్తిని,
ఆశక్తి ఛండాలాంగనయందు పరాశరుని,
ఆ పరాశరుడు పల్లెపడుచైన, మత్స్యగంధియందు మా తాత వ్యాసుని,
ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని,
పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును,
మా ఇంటిదాసితో- ధర్మనిర్మాణచణుడని మీచే కీర్తింపబడుచున్న- హ.. ఈవిదురదేవునీ కనలేదా?
సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన మాకురువంశము-
ఏనాడో కులహీనమైనది...కాగా... నేడు కులము.. కులము అను వ్యర్ధవాదమెందులకు?
భీష్మ:-
నాయనా సుయోధనా!
దుర్యో:-
తాతా
భీష్మ:-
ఏరుల,పారుల, బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవికావు.
ఇది, నీవన్నట్లుగా,ముమ్మాటికీ క్షాత్ర పరీక్షయే!
క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే!
వారిలోరాజ్యమున్న వారే రాజులు!
అట్టి రాజులే యీ కురురాజపరిషత్తులో పాల్గొనుటకు అర్హులు!
దుర్యో:-
ఓహో !
రాచరికమా అర్హతను నిర్ణయించునది. ఉ...ఊ
అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై,
సంపద్గ్రామమై వెలుగొందు, అంగరాజ్యమునకిప్పుడే
ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను.
సోదరా.. దుశ్శాసనా !
అనర్ఘ నవరత్నఖచిత కిరీటమును వేగముగ తెమ్ము;
మామా..గాంధారసార్వభౌమా !
సురుచిరమణిమయమండితసువర్ణసింహాసనమును తెప్పింపుము;
పరిజనులారా !
పుణ్య భాగీరథీ నదీ తోయములనందుకొనుడు;
కళ్యాణభట్టులారా !
మంగళ తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు,
వంధిమాగధులారా !
కర్ణ మహారాజును కైవారము గావింపుడు;
పుణ్యాంగనలారా!ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది,
బహుజన్మసుకృతపరీపాకసౌలబ్ద సహజకవచఖచితవైఢూర్య ప్రభాదిత్యోలికి వాంఛలురేగ వీరగంధము విదరాల్పుడు.
నేడీ సకలమహాజన సమక్షమున, పండిత పరిషన్మధ్యమున సర్వదా సర్వథా,
శతథా సహస్రథా ఈ కులకలక మహాపంకిలమునుశాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను.
కర్ణ:
దాతా!
నా రక్తము రంగరించి అలకులుశాది రేఖాచిగురితములైన మీ అరుణారుణ శుభపాదపద్మయుగళమునకు సౌలేపమను గావించినను మీ ఋణమీగువాడను కాను.
ఎచ్చటా శిరసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమతా ధర్మోద్ధరణకు దాసానుదాసుడు. ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితం కాగలదు. యావజ్జీవము, అహర్నిశము, విశ్వాసబద్ధుడనై, మీ హితుడనై ప్రవర్తింతునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు, సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున శపథము గావించుచున్నాను.
సుయోధన:
హితుడా!
అప్రతిహత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమే కాదు, నా అర్ధసింహాసనార్హతనిచ్చి గౌరవించుచున్నాను.
సుయోధనుడికి పాండవుల రాజసూయాగం ఆహ్వానం వచ్చినప్పుడు:-
ఊం.. ఉ.. హహహహ
విరాగియైన పాండురాజుకు సరాగిణియై కులప్రవర్తనాసక్తయైన కుంతికి జనియించిన పాండవులు !
ఆబాల్యమూ ఆటపాటలలో మమ్మలమటపెట్టిన పాండవులు !
లాక్కా గృహములో నిశీధిని నిట్టనిలువునా దహించినారన్న నీలాపనిందను మామీద వేసిన పాండవులు !
ఏకచక్రపురమున విప్రవేషములతో ఇల్లిల్లు తిరిపమెత్తి పలుకూళ్ళుమెక్కిన పాండవులు !
అంతకుతగ్గ గంతగా అతుకులబొంతగా ఐదుగురూ ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు !
స్నాయువతాసంకలిత శల్యము సంప్రాప్తించిన సుంకమున్నట్లు
మా పితృదేవదయాలభ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో
నేడీ యాగకార్యదుర్వహుగులగుటయా!
హహహహ
నరకలోకముననున్న తమ తండ్రిని యమలోకమునుండి స్వర్గలోకమునకు
జేర్చుట దీని ఆంతర్యమట ! ఏమి కల్పనాచాతుర్యము ? ఏమి కల్పనాచాతుర్యము ?
ఐనను కుంతీ మూలమున స్వర్గనరకాధిపతులిరవురు పాండురాజునకు తమ్ములేగదా !
ఐన ఇందు జరుగనిదేమి ? లోపమేమి ?
అయ్యారే ! సకలరాజన్యులోకమూ సోహో నినాదములు సలుప భారతభారతీ శుభాస్సీసులతో పరిపాలనసాగించెడి మాకు మారాటుగా సార్వభౌమత్వము సాదింప గోరే పాండవుల దుష్ప్రయత్నమా ఇది !
సాటిరాజులలో రారాజు కావలెననియెడు ధర్మజుని దుష్టంతరమా ఇది !
ఐనచో కుతంత్రముతో కుచ్చితబుద్ధితో సేయనెంచిన ఈ రాజసూయము సాగరాదు, మేమేగరాదు.
శకుని:
అని గట్టిగా అనరాదు...వేరొకరు వినరాదు. అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్థుడై సుయోధనుడు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెఱ్ఱి లోకం. ఒకవేళ నీవు పోకపోయిననూ యాగమా ఆగునది కాదు, పోయినచో స్వజనుల మీది సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది. ఎదిరి బలాన్నీ, బలగాన్నీ కనిపెట్టే అదనూ చిక్కుతుంది. వేయేల కురుసార్వభౌముడు మానవీయుడు, మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో, ఆపైన కొంచపు వంచన పనులన్నిటికీ అయిన వాడ్ని... అమ్మ తమ్ముడ్నీ నేనున్నానుగా...
ముల్లుని ముల్లుతోనే తియ్యాలి, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి. కనుక హిత పురోహిత ధృత్య వాక్య సామంత దండనాయక వారవనితా జనతా నృత్య నాట్య కళావినోద మనోహరంబగు పరివారముతో, చతురంగ బలసమేతులై శతసోదర సమన్వితులై శీశ్రీశ్రీ గాంధారీసుతాగ్రజులు ఇంద్ర ప్రస్థపురానికి విజయం చేయవలసిందే, రాజసూయయాగం సందర్శించవలసిందే..
"కురువీరులకు ధర్మజుని స్వాగతం":-
వందిమాగధులు:-
విశ్వవిశ్వంభరాభరణ సముద్దండ భుజాదండ మండిత గదాదండ ప్రహత రాజసముదాయా! కురువంశ భాగధేయా! జయీభవ! దిగ్విజయీభవ!
ధర్మ:- సోదరా భీమసేనా! కురుసార్వభౌములకు మయసభా భవనము విడిదిపట్టు గావించు.
మయసభ ఘట్టం:
సుయోధన:
కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ..
కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ..
భళా !
సముచితసత్కారస్వీకారసంత్రుప్తస్వాంతుడనగు ఈ కురుభూకాంతుని సంభావనా సంభాషణభూషణములచే ఈ సభాభవనము ధన్యము..ధన్యము..
అకుంఠితనిర్మాణచాతురీదుర్యుడవగు ఓ మయబ్రహ్మా.. నీ శిల్పచాతురీమధురిమ ఆ బ్రహ్మకుగాని విశ్వబ్రహ్మకుగాని లేదు.. లేదు.. లేదు ..
ఆ.. లేవచ్చును, లేకపోవచ్చును.. కాని పాండవహతకుల కిట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనులమైన మాబోంట్లకు దుస్సహము.
విశ్వవిశ్వంబరావినుతశాశ్వతమహైశ్వరీమహైశ్వరులము కావచ్చు..
అఖిల నదీనదసాగర వారిదర్గర భూకృత అనఘ్రముక్తామణీమ్రాతమ్ములు మాకుండిన ఉండవచ్చు..
సాగరమేఘరాసతీకరగ్రహణంబోనర్చి సార్వభౌమత్వమందిన అందవచ్చు..
కాని ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపము.
చతుర్కృతాపచారములకంటే శతృవైభవము శక్తిమంతుల హృదయములకు దావాలనసధృశము. ఇక మేమిందుండరాదు.
ఏమీ ! నిరాఘాటపదట్టనగు నాకీ కవాటఘట్టనమా ! పరులెవ్వరు లేరుకదా ! మా భంగపాటును పరికించలేదుకదా!
ఇస్సీ! ఈమయసభను మాకు విడిదిపట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవహతకులు మమ్మవమానించుటకే.
ఆ.. ఏమీ ! సభాభవన గర్భమున సుందర జలచరసంతియైన జలాశయమా ! ఆహ్
అంతయు మాయామోహితముగా ఉన్నదే !
ఉ.. ఉహ్హహ్హ.. ఇదియును అట్టిదియే.. అహహ్హహ...
పాంచాలీ... పంచభర్తృక ...
ఏమే.. ఎమేమే.. నీ ఉన్మత్తవికటాట్టహాసము ? ఎంత మరువయత్నించినను మరపునకురాక హృదయ శల్యాభిమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవె.
అహొ ! క్షీరావారాసిజనితరాకాసుధాకర వరవంశసముత్పన్నమహొత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్యదౌరేయుండనై ...
నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకగ్రజుండనై ...
పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురుప్రాప్త శస్త్రాత్రవిద్యాపారియుండైన రాధేయునకు మిత్రుండనై..
మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారికాపరీవృతయై పగులబడి నవ్వుటయా ?
అహొ ! తన పతులతో తుల్యుడనగు నను బావగా సంభావింపక, సమ్మానింపక.. గృహిణీధర్మ పరిగ్దగ్ధయై.. లజ్జావిముక్తయై.. ఆ పంతకి ఎట్ట ఎదుట యేల గేలి సేయవలె ?
అవునులే.. ఆ బైసిమాలిన భామకు ఎగ్గేమి? సిగ్గేమి ? వొంతువొంతున మగలముందొక మగనిని వచ్చనపర్యంతము రెచ్చిన కడుపిచ్చితో పచ్చిపచ్చి వైభవముల తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున హహ.. హహ.. మేమేల కటకట పడవలె ?
ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా! అని సరిపెట్టుకొందున ! ఈ లోకమును మూయ మూకుడుండునా !
ఐనను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసీ మేమేల రావలె ... వచ్చితిమి పో !
నిజరత్నప్రభాసమపేతమై సర్వర్తృసంశోభితమైన ఆ మయసభాభవనము... మాకేల విడిది కావలె.. అయినది పో !
అందు చిత్రచిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడు విద్రుక్షాపేక్ష అహ్హా.. మాకేల కలుగవలె ... కలిగినది పో !
సజీవ జలచర సంతాలవితాలమ్ములకాలవాలమగు ఆ జలాశాయమున మేమల కాలు మోపవలె .. మోపితిమి పో !
సకల రాజన్యకోటీరకోటిసంక్షిప్త రత్నప్రభా నీరాజితంబగు మాపాదపద్మమేల అపభ్రంశమందవలె.. ఏకత్సమయమునకే పరిచారికాపరీవృతయైన ఆపాతకి పాంచాలి యేల రావలె..వీక్షించవలె.. పరిహసించవలె ?
ఆ విధి.. హా విధి.. హా హతవిధీ..
ఆజన్మ శతృవులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము..,.. అవమాన బడబానలా జ్వాలలు ధగ్ధమోనర్చుచున్నవి మామా..
విముఖునిసుముఖునిజేసి మమ్మటకు విజయముసేయించిన నీ విజ్ఞాన విశేష విభావాదిత్యములు ఏమైనవి మామా ?
పాంచాలీ కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై మర్యాదాతిక్రమణముగా మనుటయా.. లేక పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా..
ఇస్సీ.. ఆడుదానిపై పగసాధింపలేక అశుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా...
ఇప్పుడేదీ కర్తవ్యము ? మనుటయా? మరణించుటయా?
ఏదీ కర్తవ్యము ?
దుశ్శా:- పాంచాలీ పరాభవము..మయసభా విధ్వంసము..పాండవ వినాశము
కర్ణ:- మహాదాతా! ఈ అవమానం మీదికాదు. మీ ఔదార్యంతో మనిషినైన నాది. ఇక మంచి లేదు, మమత లేదు, మానవత్వం లేదు. ఆనతీయండి దాతా.... ఆనతీయండి.
దుర్యో:- హితుడా!
కర్ణ:- ఆ పాండవుల తలలు నరికి మీ పాదాల ముందుంచుతాను. విచక్షణాజ్ఞానహీన, మానహీన, ఆ పాంచాలిని మీ మంచి మీద బ్రతుకీడ్చే బానిసగా... మీకు సమర్పిస్తాను. మీ యశోరక్షణకు అంకితమైన నా ప్రతాపాగ్ని ఛటఛ్ఛటలలో ఆ ఇంద్రప్రస్థ పురాన్ని భస్మీపటలం చేస్తాను.
శకు:- కానీ...దాని వలన మనకొరుగు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవునా..? పరాభవావమానములు సమసి పోవునా? హ్హహ్హహ్హ... లేదు...నీ ఊహ సరికాదు. పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణమూ, అమర లోక నివాసమూ యీ పాండవహతకులకంత సులభముగా లభించరాదు. చేసిన దోసము ప్రతి నిముసమూ తలచి తలచి, తమ దుష్కృత్యములకు తామే వగచి వగచి, కృశించి కృశించి నశించవలె! లేదా, నీకజన్మాంతమూ దాసానదాసులై నడపీనుగులవలె మనుగడ సాగించవలె!.వాడు పేరుకు ధర్మరాజేకాని, పెను వేపవిత్తు, జూదరి, వ్యసనపరుడు! ఆ మిషతోనే వానిని హస్తినకు రావించి, పాచికలాడించి, ఓడించి, సర్వమూ హరించి, నీ నిండు కొలువునకా కుమతి పాంచాలిని యీడ్పించి, వలువలూడ్పించి, వివస్త్రనుగావించి, విగత మానవతిగా నిల్పి- నీవు, నీ శతసోదరులు, నీ యశోరక్షకుడయిన యీ రాధేయుడు, తక్కుంగల నీ స్వజన బంధు మిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరూ గేలిచేసి ఘొల్లున నవ్వ- పాండవుల పంచప్రాణములు విల విల విల పోవ- అయ్యారే! నాటి మేనల్లుని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారమిదా! ఆఁ! హురే! హురే! యని సమస్త లోకమూ హర్షధ్వానములు సలుప, నా చరిత్ర భారతేతిహాసపుటలపై చిరస్థాయిగా సువర్ణాక్షరములతో లిఖించబడునటుల పగ తీర్చనిచో హుహుహు... నేను నీ మేనమామ శకునినే కాదు! నీ తల్లి గాంధారీదేవి తోడపుట్టిన వాడనే కాదు!
మాయాజూదంలో సుయోధనుడు గెలిచినపుడు:
పితుఃహూ ... అంతిమవిజయం మాదే! సుయోధనా...హురే! హురే!
మాయురే మామా.. మాయురే మాయురే హహహః
చరిత మరువదు నీ చతురత.. మాట చెల్లించిన నీకే చెందును ఎనలేని ఘనత
మా ఎద సదా మెదలును మామ యెడ కృతజ్ఞత...
పాంచాలీ... పంచభర్తృక ...
ప్రాతిగామీ!
ప్రభూ...!
ఆ వంచకి పాంచాలిని ఈ సభకు ..
భీష్మ:- నాయనా ...!
వంశంకోసం వయసంతా ధారబోసిన మేము బ్రతికి ఉండగా..వంశవినాశకరమగు వనితావంతనము అధర్మము
అవును సుయోధనా ఇది అభిమానమునకు ఆటపట్టయిన పేరు తూగదు. సాధ్వీ శిరోమణిని సభకీడ్పించుట అధర్మము.
కుమారా మాయాజూదమున పాండవ స్త్రీని గ్రహించుటే కానీ...పాండవ స్త్రీ...మా కోడలిని చెరపట్టుట అధర్మము
ఓహో...!
వయోవృ ద్దులు, గురువృ ద్దులు ధర్మబుద్ధులమనుకొను ప్రబుద్ధుల బుద్ధి ఇంత దనుక నిదురబోవుచున్నదా ఏమి ? హహ్హ.. హహ్హ.. ఇప్పుడే లేచి అధర్మమధర్మమని ఆవులించుచున్నది.
జూతం ధర్మవిరుద్ధము సప్త మహా వ్యసనములలో నీచాతి నీచమైనదని తెలిసియు అంగీకార ముద్రవేసి ఇంతదనుకా మీరేల వీక్షించితిరి?
ఐనను ద్యూతక్రీడారతుడగు ధర్మసుతునితో మామను సరిజోడునుచేసి ఆడించితినే కాని చతుష్షష్టి కళా విశారదుడనగు నేనాడలేదే ! ఆట తెలియకనా ? హహహ.. ధర్మము తెలియును గనుక.
కాని ధర్మాధర్మములు విచారింపక తమ్ముల విక్రమోపార్జితములైన సంపదలను, మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కని సొత్తే ఐనటుల ఈ పాండు సుతుడు ఒడ్డినపుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనను పెదవి కదపిరా ?
తమనొడ్డినపుడైన తమ్ములు నోరు మెదపిరా ?
ఆలిని ఓలిగా పెట్టినప్పుడైన ఆ మగువను మగటిమితో మత్స్య యంత్రము కొట్టి తెచ్చుకొన్న వాడను నేను పాంచాలిపై మీకేమి అధికారమున్నదని అర్జునుడైన అన్న నడిగెన ?
చతుర్విధ పురుషార్ధములలో సహధర్మచారిణి ఐన ధారను దయారహితముగా పందెము వైచునప్పుడైనను, అవ్వ ! ఇది అమానుషమన్నవారెవ్వరునూ లేరే ?
అ.. ఆ..
నేను గెలచుటచే మయా తిరోతరమైనది , ధర్మజుడే గెలచిన ధర్మమే జయించినదని మీరు జేజేలు కొట్టి ఉండెడి వారు కాదా !
మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మ దేవతను ఖండించి అధర్మ దేవతను ప్రళయ తాండవ మాడింపకుడు ..
తాతా! అలనాడు స్వయంవర సమయమున నా కూర్మి మిత్రుడగు కర్ణుని సూతకుల ప్రసూతుడని వదరి వర బహిష్కారము చేసిన ఆ ద్రుపదునకు బుద్ధి చెప్పుటకు ఇది ఒక ప్రయత్నం.
నాడు నను అతిధిగా ఆహ్వానించి పరిహసించిన పంచ భర్త్రుక పాంచాలి పై పగ సాధించుటే దీని ఆంతర్యం.
అంతియేకాని నా పితృ దేవ దయాలబ్ధమైన ఎంగిలి కూటికాశపడు అల్పుడను కాను, అందునా జూతార్జితమగు విత్తము పై చిత్తము నుసిగొల్పు అధముడను కాను.
నా హృదయాగ్నిజ్వాలా ప్రతిరూపమే ఈ జూతము తాతా, ఆ ప్రతీకార జ్వాలలే పాంచాలిని ఆవరించినవి. మర్మ ధర్మములతో, పక్షపాత బుద్ధులతో పాతక కర్మలతో మనుగడ సాగించు మీరీ మహాసభలో మాట్లాడ అనర్హులు. మీ హితోపదేశం కట్టిపెట్టండి, కూర్చోండి.
కృష్ణ రాయభారానికి సుయోధనుడి ప్రత్యుత్తరం
రాయభారీ... చాలించు నీ దుష్ప్రసంగం..
పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా.. సభ్యమహాజనులారా.. నా క్షేమము కోరి పలికిన మీ హిత వాక్యములకు కృతజ్ఞుడను.
రాయభారీ.. గోకులవిహారి .. హహహ్హ..
నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులలోని అంతరార్ధమును తెలియని అజ్ఞానిని కాదు..
మా గురుదేవునకు సోదరుడవని, కుంతీ దేవి మూలమున మాకు దూరపు చుట్టమని సకల రాజలాంఛనాలతో , సమస్త సత్కారాలతో అతిధిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయభారిగా ప్రకటించు కొంటివి. పగతుర కూడు కుడువనున్నదని నిన్ననే మమ్ము పగవానినిగా భావించితివి .
ఐనను, రాయభారి వచ్చునపుడు రారాజు ఆసనము నుండి లేచుట ఆచారము కాదు గనుక నిన్ను ఉచితరీతినే గౌరవించితిని.
ఊం..
రాయాభారిగా వచ్చినవాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక , ఆపైన మా అభిమతము గ్రహింపక ఇంతః ప్రల్లదనముగా ప్రవర్తించితివి.
ఇప్పుడు నేను సంధికొడంబడినచో హహ్హ.. హహ్హ.. సౌజన్యముతో డాయాదులకు పాలుపంచి ఇచ్చినట్లా ? లేక, నీవు వంధిగా వర్ణించిన వారి బలపరాక్రమాలకు లకు బెదరి ఇచ్చినట్లా ?
దూతగా వచ్చినవాడవు దూత కృత్యములు నిర్వహింపక పాతక కృత్యములకు కదంగితివి, మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి
హ..హహ.. ఐదూల్లైనా ఇవ్వని పరమ దుర్మార్గుడు రారాజని ఈ లోకమునకు చాటనెంచితివి
కృష్ణా ! నీ కోరిన కోర్కె సరియే ఐనచో, నిజమే ఐనచో నేనీయుటకీ సువిశాల సామ్రాజ్యములో ఐదూళ్ళు లేకపోవునా !
ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి ఐదూళ్ళు ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నావికానివి, నేను ఇతరులకు దానమిచ్చిన ఆ నగరములను నేను వారికెట్లు కట్టబెట్ట గలను? ఆ .. ఇది సాధ్యమా ? సంధి పొసగు మార్గమా ? హ..హహ..
ఇది గాక ...
మా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి.. ఎవరు నాకు పినతండ్రి ?
పాండురాజా ? యమధర్మరాజా ? వాయువా ? ఇంద్రుడా ? అస్వనీదేవతలా ? కృష్ణా ! శ్రత శృంగపర్వతమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగమొందుటకు హ..హహ నేనంత వెర్రివాడిననుకుంటివా ?
ఒకవేళ భాగమే పంచవలసివచ్చిన, ఈ గంగా తనయుడు పాలు వదలుకొన్నను ..
మా పిన పితామహులగు భాహ్లిక సోమదత్తులకు అందు భాగము లేదందుమా ?
అందందు వచ్చిన అర్థార్థ భాగములలో మా తండ్రులు దృతరాష్ట్ర పాండురాజు లిరువురు భాగస్వాములు కదా ? ఆపైన మేము నూర్గురము వారైదుగురు నూటైదుగురము కదా ! ఇందరమూ వంతులు వేసుకొన్నచో హ..హహ.. ఎవరికి ఎంత.. ఎంత… ఎంత వచ్చును.
అసలీ అవిభాజ్య కురుమహాసామ్రాజ్యాన్ని ముక్కలు చెక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా ?
భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశము చిన్నాభిన్నమైనచో ప్రజలకది సౌభాగ్యమా ?
ప్రజలందరు ఒకే కుటుంబముగా ఒకే పాలన క్రింద ఉండుట క్షేమము కాదా? కృష్ణా ఈ యుగధర్మము ప్రకారము ఆస్తి పదమూడు సంవత్సరములు పరాధీనమైనచో దాని పై హక్కులు శాశ్వతముగా తొలగునన్న సత్యము నీవెరుగవా?
అందులకే జూతమునకా నియమము పెట్టితిమి కాని, మతిమాలి కాదు.
అయినను జూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోర్కెలు రెండు ..
మొదటిది ధర్మరాజు దాస్యవిముక్తి రెండవది తన నలుగురు భర్తల దాస్యవిముక్తి , అంతియే కాని .. నాడు ద్రౌపది తన దాస్యవిముక్తిని కోరనూలేదు మా తండ్రిగారీయనూలేదు . కనుక ఆమె ఇప్పటికి మా దాసియే . కృష్ణా! వారీనాడు రాజ్యభాగము కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించ గలరా ? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని , ఎగ్గులేక నీవంగీకరించి రావచ్చునా ?
ఇక నీ బెదరింపులందువా ఆ కౌంతేయులు నిర్విక్రపరాక్రమసమపేతులేని, , ప్రచండ దౌర్జన్యమండితులేని.. అరివీర భయంకరులేని సంగరమునకు సమాయత్తపడక ఐదూళ్ళ కొరకు ఇట్లు దేహి దేహి దేహియని దేవిరింతురే హ !
కృష్ణా ! ఇంతయేల , ఆ కౌంతేయులకు వాడిసూది మొనమోపినంత భూమికూడా ఈయను . ఇదియే నా తుది నిర్ణయము.