ఏది నా భార్య? ఎక్కడ నా కుమారుడు?



"పాడుతా తీయగా"లో 26 నవంబర్ 2012 న వచ్చిన సత్యహరిశ్చంద్ర పద్యం...
రచన: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
సంగీతం, గానం: చీమకుర్తి నాగేశ్వరరావు గారు
ఇక్కడ పాడినది ప్రవీణ్ కుమార్...మూడవ నిమిషము నుంచి

ఏది నా భార్య? ఎక్కడ నా కుమారుడు?
ఏది నా రాజ్యసిరి? నేను ఏకాకినా?
కాదు సర్వజనులును ఏకాకులే...
అన్నదమ్ములును, ఆలు బిడ్డలును,
కన్నతల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారు తుదిన్
వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము
తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగి రావు
ఏరికిన్ ఏసరికిన్ యేపాటు విధించెనో విధి
అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు...ఊ ?
ఉన్నవాడనని ఏదో గర్వo బేరికిన్ కాదు!
కింకరుడే రాజగు, రాజే కింకరుడగున్ అదీ అదీ కాలానుకూలంబుగా!
ఆ...ఆ....ఆ...