గంగా.. నీ ఉరుకులె రాగంగా


గంగా..
గంగోత్రి (2003)
కీరవాణి
చంద్రబోస్
ఎస్.పి.చరణ్, సుజాత

పల్లవి

దింతనననా దింతన దింతన . . .
గంగా.. నీ ఉరుకులె రాగంగా నా గుండెలొ మోగంగా
సరిగమలే సాగంగా మధురిమలో మునగంగా
గంగా.. నిజంగా.. నువ్వే నాలో సగభాగంగా
నీ ఉరుకులే రాగంగా నా గుండెలే మోగంగా
సరిగమలే సాగంగా నాలో సగభాగంగా ||2||

చరణం 1

నువ్విచ్చిన మనసే క్షేమం నువ్వు పంచిన ప్రేమే క్షేమం నువ్వై నేనున్నాను క్షేమంగా
మనమాడిన ఆటలు సౌఖ్యం మనసాడిన మాటలు సౌఖ్యం
మనువయ్యే కలలున్నాయి సౌఖ్యంగా
నే చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా
ప్రతి పదమున నువు ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా
గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా ||నీ ఉరుకులే||

చరణం 2

నువ్వు పంపిన జాబుల పూలు నా సిగలో జాజులు
కాగా దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా
నీ లేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా
చేరాతలు నా తల రాతను మార్చంగా
నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనస్సుకు అద్దంగా
నువ్వు చేసిన నీ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా
గంగా నిజంగా నువ్వే నాలో సగ భాగంగా
నీ ఉరుకులే