ట్రెండు మారినా ఫ్రెండ్


ట్రెండు మారినా ఫ్రెండ్
చిత్రం : ఉన్నది ఒకటే జిందగీ (2017)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం : చంద్రబోస్
గానం : దేవిశ్రీ ప్రసాద్

నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా
సైకిల్ నుండి బైక్ లోకి మారినా
కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా
నోట్ బుక్ నుండి ఫేస్బుక్ కి మారినా
ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాక
కాలింగ్ మారినా
ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా
ఫీలింగ్ మారునా

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
ఎండు కానీ బాండు పేరు ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే

మ్మ్.. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారినా
రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్పే
లాండ్ లైన్ నుండి స్మార్ట్ఫోన్ కి మారినా
మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్పే
టూరింగ్ టాకీస్ నుండి ఐ మాక్స్ కి మారినా
పక్క పక్క సీటు పేరు ఫ్రెండ్షిప్పే
పంచుకున్న పాప్ కార్న్ ఫ్రెండ్షిప్పే

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
ఎండు కానీ బాండు పేరు ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే

పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారినా
నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్పే
ఫ్రుటీ ల నుండి బీరు లోకి మారినా
పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్పే
మొట్టికాయ నుండి గట్టి పంచ్ లోకి మారినా
నొప్పిలేని తీపిదనం ఫ్రెండ్షిప్పే
అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్పే

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
ఎండు కానీ బాండు పేరు ఫ్రెండ్షిప్పే
ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే