స్నేహితుడో
బాబు బంగారం (2016)
సంగీతం: జిబ్రాన్
గానం: రంజిత్
సాహిత్యం: శ్రీమణి
స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో శ్రామికుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
నీ కోసం వచ్చేశాడూ
ఆకాశం తెచ్చేశాడూ
అడగకముందే అందించే సాయం ... ఇతడు
స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో
ఎగిరే ఎగిరే ఆకాశం
గువ్వై రెమ్మనా వాలినదా
చిగురులు తొడిగే అవకాశం
మళ్ళీ తోటకు వచ్చినదా
నవ్వుల్ పువ్వుల్ దరహాసం
పెదవుల పడవై సాగినదా
రంగుల్ రవ్వల్ సంతోషం
మనసుని మబ్బుల విసిరినదా
మండుతున్న.. ఎండలోన
నీడ కాసే.. గొడుగు వీడు
చేదు నిండే గుండెలోనా
తీపి పుట్టే కబురు వీడు
ఏ చిన్ని గాయం నీ మీదున్నా
మోసే హృదయం ఇతడు
పసివాడి కన్నులతోనా లోకాన్నే చూస్తాడు
దండిచే వాడికి తానే
గుండెలోతు కూడా ప్రేమ పంచిస్తాడు
స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో
రాతలోన గీతలోన భాగ్యరేఖై పూసినాడు
అందమైన జాతకంలా సంబరాలే తెచ్చినాడు
నీ చిన్ని చిన్ని సరదాలన్నీ తీర్చే తొలి స్నేహితుడు
ఏ పరిచయం లేకున్నా ప్రాణం పంచిస్తాడు
సెలవంటూ వెళ్ళిపోతున్నా పండగల్లె చెవులు తిప్పి లాక్కొస్తాడు
స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో
ఎగిరే ఎగిరే ఆకాశం
గువ్వై రెమ్మన వాలినదా
చిగురులు తొడిగే అవకాశం
మళ్ళీ తోటకు వచ్చినదా
నవ్వుల్ల్ పువ్వుల్ దరహాసం
పెదవులు పడవై సాగినదా
రంగుల్ రవ్వల్ సంతోషం
మనసుని మబ్బుల విసిరినదా