చిట్టిగుమ్మ పదవే
తొలిముద్దు (1993)
ఇళయరాజా
భువనచంద్ర
బాలు, జానకి
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కొనల్లోన తేలీ
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ
చరణం 1:
కడలి అంచుల్లో జలకాలాడీ
అలలా అంతుపొంతూ చూసొద్దామా
యమహొ ముందో ముద్దు లాగిద్దామా
తొణికే వెన్నెల్లో సరసాలాడీ
వయసు హద్దు పొద్దు తేలుద్దామా
త్వరగా అస్సు బుస్సు కానిద్దామా
తరగని మోహలే వేశాయి వలలూ
తడి తడి ఒంపుల్లో పిల్లోడా
అరగని అందాలే పొంగాయి సడిలో
పెదవుల తాంబూలం అందీయవే
చనువిచ్చేయమంటోంది మనసొద్దద్దంటోంది
ఇక సిగ్గేమంటూ కొమ్మారెమ్మా ఊగాడిందీ
చరణం 2:
చలిలో చిన్నారి వయ్యారాలే
కసిగా గుచ్చి గుచ్చి ఊరిస్తుంటే
ఉసిగా తట్టి తట్టీ వేధిస్తుంటే
వలపుల కౌగిళ్ళ నజరానాలే
రతిలా మళ్ళి మళ్ళి అందిస్తుంటే
మరుడే ఒళ్ళోకొచ్చి కవ్విస్తుంటే
తెలియని ఆవేశం రేగిందే మదిలో
తలుపులు తీవేమే బుల్లెమ్మా
పరువపు ఆరాటం తీరాలీ జడిలో
తకధిమి సాగించేయ్ బుల్లోడా
ఇహ అడ్డేముందమ్మో మలి ముద్దిచ్చేవమ్మో
మెరుపల్లే బాణం సంధిచెయ్యరా వీరా ధీరా