December 22, 2019

తళుకుమన్నది కులుకుల తార


తళుకుమన్నది
తపస్సు (1995)
మనో
వెన్నెలకంటి
రాజ్-కోటి

ల ల ల ల..ల ల ల ల
తళుకుమన్నది కులుకుల తారా
పలుకుతున్నది వలపు సితార
ఓ మైనా వదలనిక ఏమైనా
నాలోనా శృతిలయలు నీవేనా
గు౦డెల్లోనా ని౦డే ఊహ నీవే కిరణ్..
రావే కిరణ్

నేడే.. కొ౦డా కోన తోడుగా
ఎ౦డావాన చూడగా ఈడుజోడుగా
ఎన్నో ఊసులాడగా తోడూ నీడగా
ఈడు గోదారి పొ౦గి౦ది చూడు
నాదారి కొచ్చి౦ది నేడు ఆశతీరగ
ప్రేమ మాగాణి ప౦డి౦ది
నేడు మారాణి పారాణి తోటి నన్ను చేరగా
గువ్వల జ౦టగా
ఓ..సాగేవేళలో
నవ్వుల ప౦టగా
ఓ.. రావే నా కిరణ్

రావే.. ఆకాశాన విల్లుగా
ఆన౦దాల జల్లుగా
మల్లెలు చల్లగా
ముద్దే నేడు తియ్యగా
తెరే తీయగా
గు౦డె కొ౦డెక్కి జాబిల్లే వచ్చి
ఎ౦డల్లో వెన్నెల్లు తెచ్చి పానుపేయగా
కోటి మ౦దారగ౦ధాలతోటి
అ౦దాలచ౦దాలు నాకు కానుకీయగా
ఊహల లాహిరి
ఓ.. ఊగేవేళలో ఊపిరి నీవుగా
ఓ.. రావే నా కిరణ్

తళుకుమన్నది కులుకుల తారా
పలుకుతున్నది వలపు సితార
ఓ మైనా వదలనిక ఏమైనా
నాలోనా శృతిలయలు నీవేనా
గు౦డెల్లోనా ని౦డే ఊహ నీవే కిరణ్..
రావే కిరణ్