చలికాలమింకా ఎన్నాళ్ళో
చిత్రం : రాగలీల (1987)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
పల్లవి:
చలికాలమింకా ఎన్నాళ్ళో
తొలిప్రేమ రాగాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళు ఇంకా ఈ దూరం
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళు ఈ మాఘమాసం
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను
చలికాలమింక ఎన్నాళ్ళో
తొలిప్రేమ రాగాలెన్నాళ్ళో...