చామంతి పువ్వా
ముగ్గురు మొనగాళ్ళు (1994)
భువనచంద్ర
చిత్ర, బాలు
విద్యాసాగర్
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ
అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
సిరిమల్లె మాల సిగలో ముడిచేయ్ నా
చెంగావి చీర సిగ్గే దోచేయ్ నా
అడిగిందే చాలు గురుడా పెనవేయ్ నా
కౌగిట్లో చేరి కళలే కలబోయనా
సుడిరేగుతుందే సుఖమైన జ్వాల
మందార దీవుల్లో ముత్యాల జల్లుల్లో
అబ్బాయి నాట్యమాడేస్తుంటే
అరెరెరె గిచ్చనా గొల్లభామ ఎంచక్కా గుచ్చనా ఘాటు ప్రేమ
జిగిజిగిచ జిగిజిగిచ జిగిచ
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
సంపంగి మొగ్గ శృతిలో సవరించు
అందాల బొమ్మ ఇదిగో అలరించు
శృంగార వీణ సఖియా పలకించు
వయ్యారమంతా ఒడిలో ఒలికించు
మరుమల్లె వేళ మదనాల గోల
పున్నాగ ఒంపుల్లో సన్నాయి సొంపుల్లో
అమ్మాయి నన్ను దాచేస్తోంటే..హహహహా
హత్తుకో అందగాడా మజాలే అందుకో చందురోడా
జిగిజిగిచ జిగిజిగిచ జిగిచ
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ
అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
అర్రె పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా