నీకు మనసిస్తా....


నీకు మనసిస్తా....
ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ (2003)
వేటూరి
ఆనంద్-మిలింద్
అభిజిత్, సాధనా సర్ గమ్

పని పమగ పస పని పమగ పస
లాలల ల లల్లా లాలల ల లల్లా

నీకు మనసిస్తా....
నిన్ను పెనవేస్తా
కన్ను చిటికేస్తే....
 కౌగిలికి వస్తా
చెలీ వస్తావా
చెలాయిస్తావా...
ఓ ప్రియా నీ దయా
దిల్ దేదియా

నీకు మనసిస్తా.... మాట కలిపేస్తా
కన్నె వయసిస్తా..... కౌగిలికి వస్తా
మొరాలిస్తావా.... వరాలిస్తావా...
ఈ ప్రియా నీదయా
దిల్ దేదియా

నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా....

చరణం 1:

నే ఆగలేకా... నీ దారి కాస్తా
నా ప్రేమ లేఖా...నీ పేర రాస్తా
వేసంగి ఎండలో... నా నీడ నీ జతా
సీతంగి మంచులో... నీ తోడు కోరుతా
నీనుకీ... నేనుకీ... మారదీ కథ

నీకు మనసిస్తా.... మాట కలిపేస్తా
కన్నె వయసిస్తా.... కౌగిలికి వస్తా
చెలీ వస్తావా... చెలాయిస్తావా
ఓ ప్రియా నీ దయా... దిల్ దేదియా

నీకు మనసిస్తా మాట కలిపేస్తా

చరణం 2:

కాలాలు దాటే... కలలు పండిస్తా
పన్నీరు మీదా... పూల పడవేస్తా
పున్నాగ పూలతో... సన్నాయి పాడుతా
వెన్నెల్ల తోటలో... నా రేయి పంచుతా
జన్మకీ.... ప్రేమకీ.... ఒక్కటే కథ...

నీకు మనసిస్తా
నిన్ను పెనవేస్తా
కన్నె వయసిస్తా....
కౌగిలికి వస్తా
మొరాలిస్తావా....
చెలాయిస్తావా
ఈ ప్రియా...
నీ దయా ...
దిల్ దేదియా