ఘడియ ఘడియల్లోన
శ్రీ రాములయ్య (1998)
సుద్దాల అశోక్ తేజ
వందేమాతరం శ్రీనివాస్
ఏసుదాస్, చిత్ర
పల్లవి:
ఘడియ ఘడియల్లోన
ఓ గండమై
గడపదాటని బ్రతుకు
సుడిగుండమై
ఘడియ ఘడియల్లోన
ఓ గండమై
గడపదాటని బ్రతుకు
సుడిగుండమై
నా ప్రాణమా
ఎడబాటు మనకున్నదా
బ్రతుకన్నదే పోరాటమని తెలియదా
నేస్తమా.... ఓ
నేనెందు బోదునయ్యా
నువ్వు లేక నేనెట్ల ఉందునయ్యా
చరణం 1 :
ఘడియ ఘడియల్లోన
ఓ గండమై
గడపదాటని బ్రతుకు
సుడిగుండమై
పట్టెడంతా ఆన్నమైనా
తినిపించలేకుంటిని
నిముషమైనా నిదురకూడా
లేదాయె నీ కంటికి
నీ భర్త కోసమే ఆరాటపడరాదు
రాగిసంకటి లేని జనము ఉన్నది చూడు
గుండె గొంతుకలోన కొట్లాడుతుంది
తిరుగుబాటే బ్రతుకుబాట అవుతుంది
నేనెందు బోదునయ్యా
నువ్వులేక నేనెట్ల ఉందునయ్యా
చరణం 2 :
ఎవరికొరకో ఎందుకొరకో
సాగించు పోరాటము
ఇల్లు విడిచి పల్లె విడిచీ
ఎన్నాళ్ళు ఈ నరకమూ
గుండెలో బాధలను దాచుకోవాలి
నా పోరు బాటలో నీ తోడు కావాలి
పల్లెనే ఇల్లుగా నువ్వు చూసుకోవాలి
పంచాది నిర్మలకు చెల్లెవని పించాలి
నీమాట కాదందునా
నీతోడు నేనుండనా
ఘడియ ఘడియల్లోన
ఓ గండమై
గడపదాటని బ్రతుకు
సుడిగుండమై
నా ప్రాణమా
ఎడబాటు మనకున్నదా
బ్రతుకన్నదే పోరాటమని తెలియదా
నేస్తమా.... ఓ
కన్నీరు నింపకమ్మా
కష్టాలు కలకాలముండవమ్మా
ఘడియ ఘడియల్లోన
ఓ గండమై
గడపదాటని బ్రతుకు
సుడిగుండమై