December 25, 2019

ఊహల పల్లకీలో

ఊహల పల్లకీలో
చిత్రం (2000)
ఆర్ఫీ పట్నాయక్
కులశేఖర్
ఉషా, నిఖిల్

ఊహల పల్లకీలో ఊరేగించన
ఆశల వెల్లువై రాగం పలికించనా
ఊహల పల్లకీలో ఊరేగించన
ఆశల వెల్లువై రాగం పలికించనా
కలహంసై కబురులు నింపనా
రాచిలకై కిలకిల నవ్వనా
నా పెదవుల మధువులె ఇవ్వనా
సయ్యాటలోనా
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా

ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా
బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా
సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా
పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా
సిరి తానుగానే వచ్చి నిన్ను చేరునురా

ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
మేఘాలకు నిచ్చెనె వేయన ఆ
కాశపుటంచులే వంచన
ఆ జాబిలి కిందకే దించనా
నా కన్నెకూనా

ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా

ఆశగా పల్లవించే పాటే నీవులే
జీవితం తోడులేని మోడే కాదులే
కలిసుండె వేళలో కలతంటు రాదులే
అమవాసై పోదులే అడియాసే కాదులే
చిరు దివ్వె గొంతు ఇంక దారి చూపునులే

ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా

మేఘాలకు నిచ్చెనె వేయన
ఆకాశపుటంచులే వంచన
ఆ జాబిలి కిందకే దించనా
నా కన్నెకూనా

ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా