కనరండి కళ్యాణం
అన్నాచెల్లెలు (1993)
సాలూరి వాసూరావు
సిరివెన్నెల
బాలు, చిత్ర
కనరండి కళ్యాణం వినరండి మంగళవాద్యం
కనరండి కళ్యాణం వినరండి మంగళవాద్యం
వెయ్యేళ్ళ వైభోగం జతకూడే సౌభాగ్యం
వెయ్యేళ్ళ వైభోగం జతకూడే సౌభాగ్యం
కనరండి కళ్యాణం వినరండి మంగళవాద్యం
కనరండి కళ్యాణం వినరండి మంగళవాద్యం
చరణం 1:
మేళ తాళముల వేదమంత్రముల ఈ పండుగా
ఊరు వాడలకు కనుల విందు కద ఈ వేడుకా
మేళ తాళముల వేదమంత్రముల ఈ పండుగా
ఊరు వాడలకు కనుల విందు కద ఈ వేడుకా
సీతనేలు రాముడయ్యే భాగ్యమందగా
చిట్టి చెల్లి చేరుకోదా బావ జంటగా
సీతనేలు రాముడయ్యే భాగ్యమందగా
చిట్టి చెల్లి చేరుకోదా బావ జంటగా
కనరండి కళ్యాణం వినరండి మంగళ వాద్యం
వెయ్యేళ్ళ వైభోగం జతకూడే సౌభాగ్యం
కనరండి కళ్యాణం వినరండి మంగళ వాద్యం
చరణం 2:
కనరండి కళ్యాణం వినరండి మంగళ వాద్యం
వెయ్యేళ్ళ వైభోగం జతకూడే సౌభాగ్యం
కనరండి కళ్యాణం వినరండి మంగళ వాద్యం
వెయ్యేళ్ళ వైభోగం జతకూడే సౌభాగ్యం
రెండు గుండెలను మూడు ముళ్ళు కలిపే సంబరం
ఏడుజన్మలకు జోడు వీడనిది ఈ సంగమం
రెండు గుండెలను మూడు ముళ్ళు కలిపే సంబరం
ఏడుజన్మలకు జోడు వీడనిది ఈ సంగమం
అష్ట సిరులు ఇంట వెలిసే ఆదిలక్ష్మి గా
అన్నగారి జంట కలిసే అగ్నిసాక్షిగా
అష్ట సిరులు ఇంట వెలిసే ఆదిలక్ష్మి గా
అన్నగారి జంట కలిసే అగ్నిసాక్షిగా
కనరండి కళ్యాణం వినరండి మంగళ వాద్యం
కనరండి కళ్యాణం వినరండి మంగళ వాద్యం
వెయ్యేళ్ళ వైభోగం జతకూడే సౌభాగ్యం
వెయ్యేళ్ళ వైభోగం జతకూడే సౌభాగ్యం
కనరండి కళ్యాణం వినరండి మంగళ వాద్యం