సత్యం ఏమిటో
అతిధి (2007),
మణిశర్మ,
సిరివెన్నెల,
దీపు, ఉష
పల్లవి:
సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో
చెప్పేదెవరు ఏ కంటికైనా
రెప్పల దుప్పటి కప్పేచీకటి
చూపించేన ఏకాంతినైనా
నిను నీవే సరిగా
కనలేదే మనసా
నడిరాతిరి నడకా
కడతేరదు తెలుసా
ఏవో జ్ఞాపకాల సుడిదాటి బైటపడలేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా
చరణం 1
చంద్రుడి ఎదలో మంటని
వెన్నెల అనుకుంటారని
నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసీ
జాబిలినీ వెలివేస్తామా తనతో చెలిమే విడిచి
రూపం లేదు కనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికిపైన అనుమానపడరు ఎపుడైనా
నిను నీవే సరిగా
కనలేదే మనసా
నడిరాతిరి నడకా
కడతేరదు తెలుసా
చరణం 2
పోయింది వెతికే వేదనా
పొందింది ఎదో పోల్చునా
సంద్రంలో ఎగిసే అలకి అలజడి నిలిచేదెపుడో
సందేహం కలిగే నదికి కలతను తీర్చేదెవరో
శాపం లాగ వెంట పడుతున్న గతం ఏదైనా
దీపం లాగ తగిన దారేదొ చూపగలిగేనా