సామజవరగమన


సామజవరగమన
చిత్రం: టాప్ హీరో (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

సామజవరగమన హోయ్ హోయ్ సామజవరగమన
ఎన్నియల్లొ ఎన్నియల్లొ హోఈ హోఈ ఎన్నియల్లొ ఎన్నియల్లొ

సామజవరగమన హోయ్ హోయ్ సామజవరగమన
ఎన్నియల్లొ ఎన్నియల్లొ హోయ్ హోయ్ ఎన్నియల్లొ ఎన్నియల్లొ

చింతాకు నడుముకు సామజ సామజ
ధింతాకునకధిమి సామజ సామజ
సింగారి వయసుకి సామజ సామజ
శృంగార పున్నమి సామజ సామజ

సామజవరగమన హోయ్ హోయ్ సామజవరగమనా
ఎన్నియల్లొ ఎన్నియల్లొ హోయ్ హోయ్ ఎన్నియల్లొ ఎన్నియల్లొ

అల్లమో బెల్లమో కనెపిల్ల అందమో
పువ్వులా నవ్వితే జివ్వుమంది ప్రాణము
చెల్లియో చెల్లకో అందుకుంటి ముద్దులు
పెళ్ళితో పిల్లడో ఉండవింక హద్దులు
చిలుక సుకుమారి హంస దొరసాని
అడవి నెమలి చిందులేయ రావే

ఏవయ్యా మావయ్య జాగు ఇంకా ఏలయ్య
భామని ప్రేమని ఏలుకోగా రావయ్య
రాగమూ యోగమూ కొంగు ముడి వేయగా
అందుకో తీయగా సంబరాలు హాయిగా
పడుచు సరసాల
వయసు మురిపాల
మనసు మనసు కలిపి వలపు విరిసె