కలగంటిని నేను కలగంటిని


కలగంటిని నేను కలగంటిని
రచన: మధురాంతకం రాజారామ్
పాడినది: బి. సుబ్బలక్ష్మి, బి. సుశీల (ఆకాశవాణి - విజయవాడ కేంద్రం)

పల్లవి

కలగంటిని, నేను కలగంటిని,
కలలోన తల్లిని కనుగొంటిని
ఎంత బాగున్నదో నా కన్నతల్లి,
ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు అగుపించే మళ్లీ-- కలగంటిని --

చరణం: 1

మెడలోన అందాల మందార మాల, జడలోన మల్లెల కుసుమాల హేల,
ఆ మోము లో వెలుగు కోటి దీపాలు,
ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, --
కలగంటిని --

చరణం: 2

కంచి కామాక్షి యా కాకున్న నేమి, కాశీ విశాలాక్షి కాకూడదేమి,
కరుణించి చూసినా వెన్నెలలు కురియు
కన్నెర్ర జేసిన మిన్నులే విరుగు --
కలగంటిని, --

చరణం: 3

పోల్చుకున్నానులే పోల్చుకున్నాను
వాల్చి మస్తకమునే ప్రణమిల్లినాను
అనుపమానాలూర భాగ్య సముపేత
ఆమె ఎవరో కాదు... భారతమాత

ఇందులో ప్రయోగించిన కొన్ని పదాల అర్ధాలు.

మిన్ను: ఆకాశం;
మస్తకము: నుదురు;
ప్రణమిల్లినాను: దణ్ణం పెట్టాను;
అనుపమానాలోక్య భాగ్యస్తమోపేత: అనుపమాన + ఆలోక్య + భాగ్యస్తమోపేత = చూసి ఆనందించడమే తప్ప చెప్పనలవిగాని భాగ్యములు కల్గిన