December 24, 2019

తెలంగాణా జానపదం


తెలంగాణా జానపదం
పల్లె పాటల పండుగ
బావ ఓసారి రావో
రచన: మట్ల తిరుపతి
గానం: మౌనిక

మబ్బులన్ని మసక బారినాయి బావ
గువ్వలన్ని గూడు జేరినాయి బావ
సుక్కలన్ని సూడ వచ్చినాయి బావ
మల్లెలన్ని ఒళ్ళు విరిసినాయి బావ
ఏడ ఉన్నావో
ఇంటికెలుమల్ల కూసుండి
ఎదురు చూస్తున్నాను
ఎప్పుడొస్తావో
ఇంటికెలుమల్ల కూసుండి
ఎదురు చూస్తున్నాను
ఎప్పుడొస్తావో

కాళ్లకు కడియాలు
చుట్టినాను బావ
కంటికి కాటుక పెట్టినాను బావ
నొసటన బొట్టును పెట్టినాను బావ
పట్టుసీర నేను కట్టినాను బావ
ఓసారి రావో
నీకోసము దాసిన అందాలను
జర చూసన్న పోవో
ఓసారి రావో
నీకోసము దాసిన అందాలను
జర చూసన్న పోవో

అయితారమంగడి పోయినాను బావ
అట్టి సేపలు నేను తెచ్చినాను బావ
మసాల మంచిగ రుబ్బినాను బావ
మనసుపెట్టి పులుసు పెట్టినాను బావ
ఓసారి రావో
నీకోసము వండిన సేపలను
రుచి చూసన్న పోవో
ఓసారి రావో
నీకోసము వండిన సేపలను
రుచి చూసన్న పోవో

తిన్న తిండి పైన వడతల్లేదు బావ
కంటికి నిదురనె మరచినాను బావ
పానము నీమీద గుంజుతుంది బావ
ఎడబాటు నేనింక ఏగలేను బావ
దండాలు బావో
నీ గుండెల్లో చోటిస్తే బంగారుమ్ముల
నిన్ను ఏలుకుంటానో
దండాలు బావో
నీ గుండెల్లో చోటిస్తే బంగారుమ్ముల
నిన్ను ఏలుకుంటానో

ఎవ్వలేమనుకున్న
నువ్వొప్పుకోకున్న
నీమీద నాప్రేమ నిండుకుండ బావ
ఏడడుగులు నీతొ ఏసుడే బావ
ఏలు బట్టి పోలు తిరుగుడే బావ
ఓసారి రావో
మంచిరోజులు ఉన్నయి ముంగట
పెళ్ళిజేసుకుందామో
ఓసారి రావో
మంచిరోజులు ఉన్నయి ముంగట
పెళ్ళిజేసుకుందామో

ఇకనన్న నామీద అలక మాను బావ
పయిలంగా ఇంటికి పయనమయ్యి రావ
కోపంగ నువ్వుంటే ఓపలేను బావ
కోరుకున్నదాన్ని దూరముంచకు బావ
ఓసారి రావో
నాకంట కన్నీరు నీకంత మంచిది
గాదులే బావో
ఓసారి రావో
నాకంట కన్నీరు నీకంత మంచిది
గాదులే బావో
నాకంట కన్నీరు నీకంత మంచిది
గాదులే బావో