వయస్సునామి
చిత్రం: కంత్రి (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: హేమచంద్ర, సునీత
వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమీ
సొగస్సుతోమి ధూముదామి ఆడు తకతైధిమి
ఉమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఓ
ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి
ఎక్కిడితొక్కిడి దక్కుడు హాయి ఓ
చెక్కిలి చిక్కిన చెక్కరలోయీ
పిల్లో పడిపోయా మాయల లోయలో
పిల్లో దిగిపోయా ఊయల లోతులో ఓ ఓ
చరణం 1:
ఎరక్కపోయి యమయమా ఇరుక్కుపోయా ప్రియతమా
తళుక్కుమన్న తమకమా చిటుక్కుమన్న చిమ చిమ
లేడి వేటకు వేడిగ వచ్చే వేటగాడివి నీవా
వేటకోసం వాడిగ చూసే మాయలేడివి నువ్వే
చనువిచ్చాక మదనా నేనోపగలనా నిన్నాపగలనా
చర్వణం 2:
కొరుక్కుతిందా నేత్రమా చురుక్కు చూపే చైత్రమా
అతుక్కుపోయే ఆత్రమా జతక్కులాసా గ్రోతమా
హింస పెట్టిన హంసవు నీవే హాయి పెంచవె భామా
ఒద్దుకాదుల వంతెన మీదే ముద్దు తీర్చర మామా
నిన్ను మెచ్చానె లలనా ఓ ఇందువదనా నీకింతపదునా
వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమీ
సొగస్సుతోమి ధూముదామి ఆడు తకతైధిమి
ఉమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఓ
ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి
ఎక్కిడితొక్కిడి దక్కుడు హాయి ఓ
చెక్కిలి చిక్కిన చెక్కరలోయీ
పిల్లో పడిపోయా మాయల లోయలో
పిల్లో దిగిపోయా ఊయల లోతులో ఓ ఓ