ఎన్నాళ్ళకి దొరికింది ఈ పద్యం...సాహిత్యం తో సహా!?
రేడియో లొ 7వ 8వ దశకాల్లో పొద్దున్నే స్టార్టింగ్ మ్యూజిక్ అవగానే వచ్చేది.
మీరు కూడా 'ఆపాత' జ్ఞాపకాలలోకి వెళ్ళి ఆనాటి
ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని ఆశిస్తూ ...
కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః।
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్॥
శబ్దార్థం:
కేయూరాణి = భుజ కీర్తులు లేదా దండ కడియాలు, న భూషయన్తి = అలంకరింపవు, పురుషం = పురుషుని,
హారాః = ముత్యాల హారములు, న = న భూషయంతి = అలంకరింప బడవు, చన్ద్రోజ్జ్వలాః = చంద్రును వలె ప్రకాశించునటువంటి,
న స్నానం = పన్నీటి జలకాలు అలంకరింపవు, న విలేపనం = పచ్చ కర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, మంచి గంధము మొదలగు సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన మైపూత అలంకరింపవు, న కుసుమం = పూవులు ధరించుట అలంకరింపదు, నాలఙ్కృతాః = అలంకరణలని ఈయజాలదు, మూర్ధజాః = వివిధ రకాల కేశాలంకరణలు,
వాణీ = ఏ వాక్కు, (సా = ఆ వాణి) ఏకా = ఒక్కటియే, సమలఙ్కరోతి = సరిగా అలంకరించునది, పురుషం = పురుషుని, యా సంస్కృతా = వ్యాకరణాది శాస్త్రములచే సంస్కరింప బడినటువంటి, ధార్యతే = ధరింపబడుచున్నదో,
క్షీయన్తే = కాలక్రమేణా నశించును, అఖిల భూషణాని = మిగిలిన అఖిలములైన భూషణాలు, సతతం = ఎల్లప్పుడూ, వాగ్భూషణం = వాక్కు అనే ఆభరణము, భూషణమ్ = నిజమైన ఆభరణము.
ఖలు = కదా!
భావార్థం:
వాక్కు అనగా విద్య. ఆ వాక్కు యొక్క ప్రాముఖ్యాన్ని, దాని విలువని ప్రస్ఫుటముగా తెలియజెప్పే భర్తృహరి నీతిశతకములోని చక్కటి సుభాషితము.
భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని అలంకరింపవు.
చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశించునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాల కేశాలంకరణల పురుషునికి నిజమైన అలంకరణలు కాజాలవు.
వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకార ప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము.
భర్తృహరి యొక్క సుభాషితములలోని నీతి శతకములో వాక్కు యొక్క ప్రాసస్థ్యాన్ని తెలియపరచే తలమానికమైనట్టి ఈ సుభాషితమునకు, ఏనుగు లక్ష్మణ కవి యొక్క అంతటి ధీటైన తెలుగు సేత ఈ క్రింది పద్యము.
ఉత్పలమాల.
భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్,
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలుగావు, పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్.
అలానే ఎలకూచి బాల సరస్వతి గారి పద్యము
మత్తేభము.
కమనీయంబగు విద్యభంగి దను శృంగారంబు గల్పింపలే /
వమలేందుద్యుతులైన హారములు కేశాలంక్రియ ల్మజ్జనం/
బు మనోజ్ఞాంగద చందనాదులఖిలంబున్బోవు బోదెందు వా/
క్యమయంబౌతొడ వేరికి స్సురభిమల్లా నీతివాచస్పతీ //

No comments:
Post a Comment
Leave your comments