రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము
రామ నామము రామ నామము రామ నామము రామ నామము
శ్రీమదఖిల రహస్య మంత్ర విశేష ధామము శ్రీరామ నామము ||రా||
దారిన ఒంటిగా నడచువారికి తోడు నీడే శ్రీరామ నామము ||రా||
నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీరామ నామము ||రా||
కోరి కొలిచిన వారికెల్లరికి కొంగు బంగరు శ్రీరామ నామము ||రా||
పాహి కృష్ణా యనుచు ద్రౌపది పలికినది శ్రీరామ నామము ||రా||
ఆలు బిడ్డల సౌఖ్యముకన్న అధిక మైనది శ్రీరామ నామము ||రా||
నీవు నేనను భేదము లేక యున్నది శ్రీరామ నామము ||రా||
ఇడా పింగళ మధ్యమందున ఇమిడియున్నది శ్రీరామ నామము ||రా||
అండ పిండ బ్రహ్మాండముల కాధారమైనది శ్రీరామ నామము ||రా||
గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపియించు నామము ||రా||
గోచరంబగు జగములోపల గోప్యమైనది శ్రీరామ నామము ||రా||
బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా భావమే శ్రీరామ నామము ||రా||
వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామ నామము ||రా||
భక్తితో భజియించువారికి ముక్తినొసగును రామ నామము ||రా||
భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామ నామము ||రా||
ఆది మధ్యాంత రహిత మనాది సిద్ధము రామ నామము ||రా||
సకల జీవులలోన వెలిగే సాక్షి భూతము శ్రీ రామ నామము ||రా||
జన్మమృత్యుజరా వ్యాధుల జక్కబరుచును రామ నామము ||రా||
ద్వేష రాగ లోభ మోహములను ద్రెంచునది శ్రీరామ నామము ||రా||
ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము ||రా||
సృష్టి స్థితి లయ కారణంబగు సుక్ష్మ రూపము రామ నామము ||రా||
శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీ రామ నామము ||రా||
సాంఖ్య మెరిగెడి తత్త్వ విదులకు సాధనము రామ నామము ||రా||
రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది శ్రీరామ నామము ||రా||
ఆత్మసంయమయోగ సిద్ధికి ఆయుధము రామ నామము ||రా||
నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామ నామము ||రా||
కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును శ్రీరామ నామము ||రా||
సత్త్వ రజస్ తమోగుణముల కతీతమైనది రామ నామము ||రా||
ఆగామి సంచిత ప్రారబ్ధముల హరియించునది శ్రీరామ నామము ||రా||
ఆశ విడచిన తృప్తులకు ఆనండమోసగును రామనామము ||రా||
ప్రణవమను "ఓం" కార నాద బ్రహ్మమే శ్రీ రామనామము ||రా||
మనసు స్థిరముగ నిలుప గలిగెడి మంత్ర రాజము రామనామము ||రా||
జన్మ మృత్యు రహస్యమెరిగి జపించవలె శ్రీ రామనామము ||రా||
విషయ వాసనలెల్ల విడచిన విదితమగు రామనామము ||రా||
పసితనంబున నభ్యసించిన పట్టుబడు శ్రీ రామనామము ||రా||
సర్వ మతములలోని తత్త్వ సారమే రామనామము ||రా||
నిర్మలంబుగా శోధ చేసిన నేర్వదగు శ్రీ రామనామము ||రా||
విజ్ఞుడగు గురువునాశ్రయించిన విశదమగు రామనామము ||రా||
జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీ రామనామము ||రా||
మరణ కాలమునందు ముక్తికి మార్గమగు రామనామము ||రా||
పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీ రామనామము ||రా||
ఎందరో మహానుభావుల నుద్ధరించిన రామనామము ||రా||
తుంటరి కామాదులను మంట గాలుపునది శ్రీ రామనామము ||రా||
మేరుగిరి శిఖరాగ్రమందున మేరయుచున్నది రామనామము ||రా||
సిద్ధ మూర్తులు మాటి మాటికి పలుకునది శ్రీ రామనామము ||రా|
వెంట తిరిగెడి వారికెల్లరి కానంద దాయకము రామనామము ||రా||
ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము శ్రీ రామనామము ||రా||
కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము ||రా||
గరుడ గమనాదులకైన కడు రమ్యమైనది శ్రీ రామనామము ||రా||
ధాత వ్రాసిన వ్రాత తుడిచెడి దైవమే రామనామము ||రా||
పుట్ట తానై పాము తానై బుస్స కొట్టును శ్రీ రామనామము ||రా||
అష్ట దళముల కమలమందున అమరియున్నది రామనామము ||రా||
అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీ రామనామము ||రా||
జపతపంబుల కర్హమైనది జగతిలో రామనామము ||రా||
జ్ఞాన భూముల నేడు గడచిన మౌన దేశము శ్రీ రామనామము ||రా||
తత్త్వశిఖరము నందు వెలిగే నిత్య సత్యము రామనామము ||రా||
దట్టమైన గాఢ అంధకారములను రూపు మాపును శ్రీ రామనామము ||రా||