ఈడుజోడుగా తోడునీడగా


ఈడుజోడుగా తోడునీడగా
దొంగల్లో దొర (1957)
రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం: సుబ్రహ్మణ్య రాజు
గానం: ఘంటసాల, పి. లీల

పల్లవి:

ఓహో రాణి ఓ ఓ ఓ ఓ రాజా
ఓహో రాణి ఓ ఓ ఓ ఓ రాజా
ఈడుజోడుగా తోడునీడగా
ఈడుజోడుగా తోడునీడగా
మనముందాములే ఈ తీరుగా
ఈడుజోడుగా తోడునీడగా

చరణం1:

రేరాజు పలుక రేరాణి కులుక
విందైన వెన్నెల చిందు వేయగా
రేరాజు పలుక రేరాణి కులుక
విందైన వెన్నెల చిందు వేయగా
ఈ రేయి నీవై, నీహాయి నేనై ఆ ఆ ఆ ఆ
ఈ రేయి నీవై, నీహాయి నేనై
కడలి పొంగారు సరసాల లీలగా
ఈడుజోడుగా తోడునీడగా

చరణం2:

నీ వాలుకన్నుల పరువము నీనై
నన్నేలు చిన్నారి మురిపెము నీవై
నీ వాలుకన్నుల పరువము నీనై
నన్నేలు చిన్నారి మురిపము నీవై
నీ బాస నేనై, నా ఆశ నీవై ఆ ఆ ఆ ఆ
నీ బాస నేనై,నా ఆశ నీవై
కలిసి కలకాలము ఈ లీలగా

ఈడుజోడుగా తోడునీడగా
మనముందాములే ఈ తీరుగా
ఈడుజోడుగా తోడునీడగా
ఓహో రాణి ఓ ఓ ఓ ఓ రాజా
ఓహో రాణి ఓ ఓ ఓ ఓ రాజా