అల్లి బిల్లీ పిల్లల్లారా


అల్లి బిల్లీ పిల్లల్లారా
చిత్రం: రక్త సిందూరం (1967)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గానం: సుశీల బృందం
రచన: ఆరుద్ర

అల్లిబిల్లి పిల్లల్లారా
ఇల్లా రండి
మీరు.. ఇల్లా రండి
అట్లాతద్ది కన్నెనోము నోచాలండి..
నేడే నోచాలండి..

అందాల హంసతో
అలరించే చిలకతో
చిందేసే నెమలితో
తుళ్ళి తుళ్ళి ఆడుదాం

ఊరించే ఊహతో
కేరింతలాడుతూ
ఊరించే ఊహతో
కేరింతలాడుతూ
కోరికలే కలకాలం పండాలి
ఓ పండాలీ
తొక్కుడుబిళ్ళ, దాగుడుమూత
గుడుగుడుగుంచం, గుజ్జెనగూళ్ళు
పాడిననాడు చక్కని మగడు
పాడకపోతే తన్నే మగడు
నీకే...నీకే...నీకే 

అల్లిబిల్లి పిల్లల్లారా
ఇల్లా రండి
మీరు.. ఇల్లా రండి
అట్లాతద్ది కన్నెనోము నోచాలండి..
నేడే నోచాలండి..

ఉయ్యాలలూగుదాం
సయ్యాటలాడుదాం
ఒయ్యారమొలకబోసి
పాటలెన్నో పాడుదాం
ఉయ్యాలలూగుదాం
సయ్యాటలాడుదాం
ఒయ్యారమొలకబోసి
పాటలెన్నో పాడుదాం
విరజాజి తీగలై
విరితేనే వాగులై
విరజాజి తీగలై
విరితేనే వాగులై
పరువాలే కవ్వించి నవ్వాలి

జాబిలికన్నా చల్లనివాడు
వస్తాడమ్మా నేడో రేపో
నచ్చినవాడు వచ్చిననాడు
ఏం చేస్తావో పిల్లా చెప్పూ
నవ్వుతావా?
సిగ్గుపడతావా?
పులకిస్తావా?
కాదే పెళ్ళాడి పెనవేస్కుంటుందే

అల్లిబిల్లి పిల్లల్లారా
ఇల్లా రండి
మీరు.. ఇల్లా రండి
అట్లాతద్ది కన్నెనోము నోచాలండి..
నేడే నోచాలండి..