మై బోల్తుం సునో రాజా


మై బోల్తుం సునో రాజా
రాయలసీమ
జానపద నవరత్నాలు
గానం: మునెయ్య
సంగీతం: జి. ఆనంద్

మై బోల్తుం సునో రాజా
నే చెప్తానొక మాటా
మై బోల్తుం సునో రాజా

గడ్డానికున్నది గరికె
దాన్ని గుఱ్ఱమొచ్చి పెరక
గుఱ్ఱమొచ్చి పెరక
వాడు మొత్తుకుంట ఉరక

సెన్నంపల్లె శెనగల్
అవి ఏగుతున్నయ్ పప్పుల్
మా అక్కకొచ్చెన్ నొప్పుల్
మా బావకొచ్చెన్ తిప్పల్

దావణ బోయేది బండి
ఆ బండి కున్నది గండి
రూపాయ కున్నది వడ్డి
వాళ్ళ నాయనకేమో నడ్డి

తమ్మూడు పెద్ద జ్ఞాని
వానికున్నదొక్క గూని
అన్నాకు పెద్ద ఛాతీ
వాడ్ని చూస్తే కోతి మూతి