నా మనసే..
విచిత్ర దాంపత్యం (1971)
సంగీత::అశ్వద్థామ
రచన::నారాయణరెడ్డి
గానం::సుశీల
పల్లవి::
నా మనసే..ఏ..వీణియగా..ఆఆ..పాడనీ
నా మనసే వీణియగా..పాడనీ
నీ వలపే వేణువుగా..మ్రోగనీ
ఈఈఈఈఈఈ
నా మనసే వేణియగా..పాడనీ
చరణం::1
కాదని ఎంతగ..కరిసినా
కడకన్నుల..కెంపులు కురిసినా..ఆ
కాదని ఎంతగ...కరిసినా
కడకన్నుల...కెంపులు కురిసినా
ఏనాటికైన...నీ రాధనురా
ఒకనాటికి తీరని...గాథనురా
నీ...రాధనురా
నా మనసే వీణియగా..పాడనీ
నీ వలపే వేణువుగా మ్రోగనీ
ఈఈఈఈఈఈ
నా మనసే వీణియగా..పాడనీ
చరణం::2
వెదురు పొదలలో..దాగినా
నీవేవనిలో..తిరుగాడినా
వెదురు పొదలలో..దాగినా
నీవేవనిలో..తిరుగాడినా
నీ పదములు..నాలో మెదలునురా
నా హృదయము నిన్నే వెదుకునురా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
నా మనసే వీణియగా పాడనీ
నీ వలపే వేణువుగా మ్రోగనీ
ఈఈఈఈఈఈ
నా మనసే వీణియగా పాడనీ
చరణం::3
సిరులు కోరి నిను..కొలిచితినా
మరులు పొంగి నిను..వలచితినా
ఆ ఆ ఆ ఆ ఆ..
సిరులు కోరి నిను..కొలిచితినా
మరులు పొంగి నిను..వలచితినా
ఎన్నో జన్మల...అనుబంధం
ఇరువురినీ...కలిపిన బంధం
నా మనసే వీణియగా..పాడనీ
నీ వలపే వేణువుగా..మ్రోగనీ
ఈఈఈఈఈఈ
నా మనసే వీణియగా పాడనీ