సూర్యవంశం (1998)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
గానం: బాలు, చిత్ర
రచన: ఇ.ఎస్. మూర్తి
పల్లవి:
ల ల ల …..
కిలకిల నవ్వే కోయిల కోసం
వచ్చిందీ మధుమాసం
మిలమిల మెరిసే చంద్రుడి కోసం
తెరతీసెను సాయంత్రం
జోలగా లాలించగా నీ నీడ దొరికింది
కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది
ఎదవిల్లును వంచిన వాడే
నీ రాముడు అన్నది మనసే
గుడి తలుపులు తీయక ముందే
వరమిచ్చెను దేవత ఎదురై
నీదే ఆ చెలి
నిజమేనా జాబిలీ
కిలకిల నవ్వే కోయిల
చరణం 1:
ఎదురుచూపులో ఇంత తీపని
తెలియలేదు మునుపు
ఎదురుచూడని ఇంత హాయిని
మరిచిపోదు మనసు
ఒదిగి ఉండి నీ వాకిటిలో
బదులుకోరి నే నిలుచున్నా
దారి తెలియని చీకటిలో
వెలుగు చూసి కాదంటానా
ఊరించే ఇది ఏ మాసం
ప్రేమించే ప్రతి గుండెను
అందెల సందడి చేసే
హేమంతం ఇది
మన సొంతం ఐనది
కిలకిల నవ్వే కోయిల
చరణం 2:
మావితోట మగపెళ్లి వారికి
విడిది అంది చిలక
మనువు ముందరే మంతనాలకి
కదిలే గోరువంక
జాబిలమ్మని జాజులతో
తరలి రమ్మని అందామా
పేద మనసుకి పెళ్లంటే
అతిధులెవ్వరూ రారమ్మ
నీ కన్నా సిరులా మిన్నా
ఓ మైనా మన మనువును మెచ్చిన
మనసులు పెట్టిన సుముహూర్తం ఇది
వధువై రానా మరి
కిలకిల నవ్వే