December 26, 2019

నీవనీ నేననీ లేనేలేవు


నీవనీ నేననీ లేనేలేవు
అల్లుడే మేనల్లుడు (1970)
గజల్ శంకర్
సినారె
సుశీల, ఘంటసాల

నీవనీ నేననీ
నీవనీ నేననీ
లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు
ఓ .... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు
కెరటాలై కిరణాలై  ఓ...
కెరటాలై కిరణాలై
పరుగిడ పరుగిడ పరువాలు

పలుకలేని కన్నులతో పలుకరించుకుందాము
పలుకలేని కన్నులతో పలుకరించుకుందాము
పులకరించు పెదవులతో వలపు పంచుకుందాము
వలపు పంచుకుందాము
ఒకరికొకరు పందిరిగా ఊహలల్లుకుందాము
ఊహలల్లుకుందాము
ఆ....
నీవనీ నేననీ
నీవనీ నేననీ
లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు
ఓ .... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు

చరణం 1:

నీ వలపే నిచ్చెనగా నేనందితి గగనాలు
నిను లతలా పెనవేసి కనుగొంటిని స్వర్గాలు

నీ వలపే నిచ్చెనగా నేనందితి గగనాలు
నిను లతలా పెనవేసి కనుగొంటిని స్వర్గాలు

కలకాలం ఈ బంధం నిలపాలి దేవతలు
కలకాలం ఈ బంధం నిలపాలి దేవతలు
ఆ....
నీవనీ నేననీ
నీవనీ నేననీ
లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు
ఓ .... లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు తెరలు