గాలిలోనే మాటిమాటికీ
చిత్రం : సత్య (1998)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రాజేష్
పల్లవి:
గాలిలోనే మాటిమాటికీ
వేలితో నీ పేరు రాయడం
గాలిలోనే మాటిమాటికీ
వేలితో నీ పేరు రాయడం
ఏమయ్యిందో ఏమిటో
నాకేమయ్యిందో ఏమిటో
రాతిరంతా చందమామతో
లేని పోని ఊసులాడటం
ఏమయ్యిందో ఏమిటో
నాకేమయ్యిందో ఏమిటో
చరణం 1:
ఒక్కసారి నిన్ను వాన ఒళ్ళో
ఆడుతుంటే చూసాను
అంతవరకు ఎపుడూ ఆనవాలే
లేని ఊహలోన తడిసాను
విరిసే వానవిల్లులా కనులో నువ్విలా
కొలువుండిపోతె ఇంక నిదురించేదెలా
కునుకురాని అర్ధరాత్రిలో...
కళ్ళు తెరిచి కలవరించడం
ఏమయ్యిందో ఏమిటో
నాకేమయ్యిందో ఏమిటో
చరణం 2:
మెరిసే మాయలేడి రూపం
మంత్రం వేసి నన్ను లాగుతుంటే
ఆగుతుందా నాలో వయసు వేగం
మనస్సులో సముద్రమై
అలజడి ఎటున్నా రమ్మనీ
నీకోసం కోటి అలలై పిలిచే సందడి
దిక్కులంటినీ దాటి జాడ వెతకనీ
దారి పోయే ప్రతివారిలో
నీ పోలికలే వెతుకుతుండటం
ఏమయ్యిందో ఏమిటో
నాకేమయ్యిందో ఏమిటో