కులాసా రాదోయ్ రమ్మంటే


కులాసా రాదోయ్ రమ్మంటే
చిత్రం: అన్నపూర్ణ (1960)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
రచన: ఆరుద్ర
గానం: జిక్కి(కృష్ణవేణి)

పల్లవి: 

కులాసా రాదోయ్ రమ్మంటే
మజాకా కాదోయ్ వలపంటే
ఖలేజా అంటూ వుండాలోయ్ రాజా
అదుంటే ఎపుడూ నిన్ను ఎడబాయనోయ్

కులాసా రాదోయ్ రమ్మంటే
మజాకా కాదోయ్ వలపంటే
ఖలేజా అంటూ వుండాలోయ్ రాజా
అదుంటే ఎపుడూ నిన్ను ఎడబాయనోయ్
చరణం 1: 

గులాబీ చక్కదనం
జిలేబీ తియ్యదనం
చలాకీ సొగసుల లేతదనం
కలసిన యవ్వనం
గులాబీ చక్కదనం
జిలేబీ తియ్యదనం
చలాకీ సొగసుల లేతదనం
కలసిన యవ్వనం
నీదే చేసెద అందమూ
నీకూ నాకూ బంధమూ..
పోనోయ్.. పొమ్మంటే..
నీదే చేసెద అందమూ
నీకూ నాకూ బంధమూ..
పోనోయ్.. పొమ్మంటే..

చరణం 2: 

వయ్యారం ఒలికిస్తా
హుషారు కలిగిస్తా
వరించి నీచే వలపిస్తా
వోహో అనిపిస్తా
వయ్యారం ఒలికిస్తా
హుషారు కలిగిస్తా
వరించి నీచే వలపిస్తా
వోహో అనిపిస్తా
రావాలనుకుని వచ్చావు
యిక పోవాలన్నా పోనీను
మనసోయ్ నీవంటే
రావాలనుకుని వచ్చావు
యిక పోవాలన్నా పోనీను
మనసోయ్ నీవంటే