నీ వయస్సు కో నమస్సు
నాయుడు గారి అబ్బాయి (1996)
వేటూరి
బాలు, చిత్ర
కోటి
నీ వయస్సు కో నమస్సు నిత్య మల్లిక
నా మనస్సులో ఉషస్సు నవ్య గీతిక
తేనెలా తియ్యగా
రాయని పాటగా
మనసంతా రాగవనం క్షణం క్షణం రసార్పణం
ఔనా...
అంచులు దాటే అలజడి లోన
తనువులు రెండు తడబడగా
ఎదలను మీటే మధురిమలన్ని
ఎదురై తానే అడుగిడగా
వలచిన కాలఖండమే వసంతమై
నిలిచిన ప్రేమబంధమే సుఖాంతమై
అందాలన్నీ సింధూరాలై
ఆవరించగా
మలి సందెలోన అందుకున్న మరుల విరుల కానుక
అవునా....
మంచై రాలే మౌనం తానే
మంజుల గానం తలపెడితే
కొంటెగ వేచే కోరికలన్నీ
కౌగిలి కోసం కలబడితే
ఎగిసిన వింత సంబరం విహంగమై
పిలిచిన నీలి అంబరం విహారమై
మోహాలన్నీ దాహం వేసి మోహరించగా
చిరు ముద్దుతోనే ఇచ్చుకున్న మొదటి తీపి జ్ఞాపిక
అవునా...
నీ వయస్సు కో నమస్సు నిత్య మల్లిక
నా మనస్సులో ఉషస్సు నవ్య గీతికా
తేనెలా తియ్యగా
రాయని పాటగా
మనసంతా రాగవనం క్షణం క్షణం రసార్పణం
ఔనా...
నాయుడు గారి అబ్బాయి (1996)
వేటూరి
బాలు, చిత్ర
కోటి
నీ వయస్సు కో నమస్సు నిత్య మల్లిక
నా మనస్సులో ఉషస్సు నవ్య గీతిక
తేనెలా తియ్యగా
రాయని పాటగా
మనసంతా రాగవనం క్షణం క్షణం రసార్పణం
ఔనా...
అంచులు దాటే అలజడి లోన
తనువులు రెండు తడబడగా
ఎదలను మీటే మధురిమలన్ని
ఎదురై తానే అడుగిడగా
వలచిన కాలఖండమే వసంతమై
నిలిచిన ప్రేమబంధమే సుఖాంతమై
అందాలన్నీ సింధూరాలై
ఆవరించగా
మలి సందెలోన అందుకున్న మరుల విరుల కానుక
అవునా....
మంచై రాలే మౌనం తానే
మంజుల గానం తలపెడితే
కొంటెగ వేచే కోరికలన్నీ
కౌగిలి కోసం కలబడితే
ఎగిసిన వింత సంబరం విహంగమై
పిలిచిన నీలి అంబరం విహారమై
మోహాలన్నీ దాహం వేసి మోహరించగా
చిరు ముద్దుతోనే ఇచ్చుకున్న మొదటి తీపి జ్ఞాపిక
అవునా...
నీ వయస్సు కో నమస్సు నిత్య మల్లిక
నా మనస్సులో ఉషస్సు నవ్య గీతికా
తేనెలా తియ్యగా
రాయని పాటగా
మనసంతా రాగవనం క్షణం క్షణం రసార్పణం
ఔనా...