శ్రీరామ నీ నామమేమి రుచిరా
రామదాసు కీర్తనలు
రాగం: కరహరప్రియ-
ఆది తాళం
మంగళంపల్లి బాలమురళీకృష్ణ
పల్లవి:
శ్రీరామ నీ నామమేమి రుచిరా
ఓ రామ నీ నామమెంత రుచిరా
1) కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణుల గాచిన నీ నామమేమి రుచిరా
2) కదలీ ఖర్జూరాది ఫల రసముల కంటె పతిత పావన నామమెంత రుచిరా
3) అంజనా తనయ హృత్కంజ దళములందు రంజిల్లు నీ నామమేమి రుచిరా
4) సదాశివుడు మది సదా భజించెడి సదానంద నామమెంత రుచిరా
5) తుంబురు నారదులు డంబు మీరగ గానంబు జేసెడి నామమేమి రుచిరా
6) అరయ భద్రాచల శ్రీ రామదాసుని ప్రేమనేలిన నామమెంత రుచిరా
క్రింద పంచుకున్న చరణాలను ఈ పాటలో పొందుపరచలేదు.
7) సారము లేని సంసారమునకు సంతారకమగు నామమేమి రుచిరా
8) శరణన్న జనముల సరగున రక్షించు బిరుదు కల్గిన నామమెంత రుచిరా
9) మధురసముల కంటె దధి ఘృతముల కంటె అతిరసమగు నామమేమి రుచిరా
10) నవరస పరమాన్న నవనీతముల కంటెనధికమౌ నీ నామమెంత రుచిరా