పూవులు పూయును
చిత్రం : గురువును మించిన శిష్యుడు (1963)
సంగీతం : ఎస్.పి. కోదండపాణి
గీతరచయిత : కృష్ణమూర్తి
నేపధ్య గానం : జానకి
పల్లవి :
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పూవులు పూయును పదివేలు... భగవానుని మెడలో ఎది వ్రాలు
పూవులు పూయును..పదివేలు... భగవానుని మెడలో ఎది వ్రాలు
ప్రాణములున్నవి అందరికీ... ప్రణయము తెలిసేదెందరికి ..

చరణం 1 :
అరుదైన వరం మన జీవితమూ... ఆనందానికి అది అంకితమూ

అరచేతిన ఉన్నది... స్వర్గమురా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అరచేతిన ఉన్నది స్వర్గమురా... అది ఎరుగని వారిదే నరకమురా
పూవులు పూయును..పదివేలు... భగవానుని మెడలో ఎది వ్రాలు
చరణం 2 :
చేజారినదీ నిన్నటిదినమూ... జనియించనిదే రేపటి దినమూ

అవి అందనివీ... మనకెందుకురా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అవి అందనివీ మనకెందుకురా... ఈ దినమే మనదనుకొందామురా