ఆడ జన్మకు ఎన్ని శోకాలో


చిన్ని తల్లికి ఎన్ని శాపాలో
చిత్రం: దళపతి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట
ఎటు సాగునో నీ బాట
ఇది కాదా దేవుని ఆట
ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో

చరణం: 1

మాటాడే నీ కన్నులే
నాకవి పున్నమి వెన్నెలే
నీ చిరు బోసినవ్వురా
నాకది జాజిపువ్వురా
వీధినే పడి వాడిపోవునో
దైవసన్నిధి నే చేరునో
ఇక ఏమౌనో

ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట
ఇది కాదా దేవుని ఆట
ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో