దొంగచూపులు చూచి


దొంగచూపులు చూచి
చిత్రం : కలవారి కోడలు (1964)
సంగీతం : టి. చలపతి రావు
రచన: కొసరాజు
నేపధ్య గానం : ఘంటసాల, జిక్కి

పల్లవి :

ఓహో..ఓ..ఓ..ఓ.ఓఓ...ఓ...ఓ...
ఓహో..ఓ..ఓ..ఓ.ఓఓ...ఓ...ఓ...
ఓహో..ఓ..ఓ..ఓ.ఓఓ...ఓ...ఓ...

దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
కొత్త వలపులు చిలికితివా...  మత్తుకనులా చినదానా

దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
మత్తుమందు చిలికితివా మనసు పడినా చినవాడా

చరణం 1 :

ముచ్చటైన కురులు దువ్వి... మొగలిరేకులా జడను వేసి
ముచ్చటైన కురులు దువ్వి... మొగలిరేకులా జడను వేసి
మోజుతీర ముస్తాబు చేసి... మోమాటపడనేల ఓ చిన్నదానా

దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
కొత్త వలపులు చిలికితివా...  మత్తుకనులా చినదానా

చరణం 2 :

కోరమీసాల మెలేసి... కోటిసరసాల వలేసి
కోరమీసాల మెలేసి... కోటిసరసాల వలేసి
చిలిపిసైగల పిలిచావు గాని... చెప్పేటి కబురేమి ఓ చిన్నవాడా

దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
మత్తుమందు చిలికితివా...  మనసు పడినా చినవాడా

చరణం 3 :

హంసలాగ నడచిరాగా... అందమంతా పొంగిపోగా
హంసలాగ నడచిరాగా... అందమంతా పొంగిపోగా
కోయిలల్లే గొంతెత్తి పాడ... గుండెల్లో గిలిగింతలయ్యేను పిల్లా

దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
కొత్త వలపులు చిలికితివా మత్తుకనులా చినదానా

చరణం 4 :

పూలతావుల చేరదీసి... గాలితీగలా ఓడగట్టి
పూలతావుల చేరదీసి... గాలితీగలా ఓడగట్టి
మత్తుదారుల కేరింతలాడి... మైమరచిపోదాము ఓ చిన్నవాడా

దొంగచూపులు చూచి... దోరవయసు దోచీ
కొత్త వలపులు చిలికితివా మత్తుకనులా చినదానా

ఓహో..ఓ..ఓ..ఓ.ఓఓ...ఓ...ఓ...
ఓహో..ఓ..ఓ..ఓ.ఓఓ...ఓ...ఓ...
ఓహో..ఓ..ఓ..ఓ.ఓఓ...ఓ...ఓ...