November 28, 2020

జయమంగళం


జయమంగళం నిత్య శుభ 
రాగం: ఘంటా,గౌరీ
కృష్ణం వందే జగద్గురుమ్
రచన: నారాయణ తీర్థ
గానం: వేదవతి ప్రభాకర్  

సుశీల గారు పాడిన పాట.

 
పల్లవి:

జయమంగళం నిత్య శుభమంగళం

అనుపల్లవి:

మంగళం రుక్మిణీరమణాయ శ్రీమతే
మంగళం రమణీయమూర్తయే తే
మంగళం శ్రీవత్సభూషాయ శార్ఙ్గిణే
మంగళం నందగోపాత్మజాయ॥

చరణం 1:

పూతనాకంసాదిపుణ్యజనహారిణే
పురుహూతముఖదేవహితకరాయ
సూతాయవిజయస్య సుందరముఖాబ్జాయ
శీతకిరణాదికులభూషణాయ॥

చరణం 2:

కాళీయమౌళిమణిరంజితపదాబ్జాయ
కాలాంబుదశ్యామ దివ్యతనవే
కారుణ్యరసవర్షినయనారవిందాయ
కల్యాణగుణరత్నవారినిధయే॥

చరణం 3:

నవనీతచోరాయ నందాదిగోపగో
రక్షిణే గోపికావల్లభాయ
నారదమునీంద్రనుతనామధేయాయతే
నారాయణానందతీర్థగురవే॥