మాఘమాస వేళ వచ్చె
ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)
రచన: చంద్రబోస్
సంగీతం: ఘంటాడి కృష్ణ
గానం: మనో, హరిణి
ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)
రచన: చంద్రబోస్
సంగీతం: ఘంటాడి కృష్ణ
గానం: మనో, హరిణి
సాకీ:
పట్టుచీర కట్టుకోని
పారాణి దిద్దుకోని
చుక్కలన్ని కోసుకొచ్చి
కొప్పునిండ పెట్టుకోని
మెరిసేటి మేఘాన్ని
కాటుకల్లె దిద్దుకోని
పందిట్లొ అడుగుపెట్టె
పెళ్ళికూతురు...
పట్టుపంచె కట్టుకోని
బుగ్గచుక్క నెట్టుకోని
చక్కనైన చందమామ
వెన్నెలమ్మ తోడు రాగ
సన్నాయి మేళాలు
పందిట్లో మ్రోగంగ
అక్షింతలేసి
దీవించరండి
బుగ్గచుక్క నెట్టుకోని
చక్కనైన చందమామ
వెన్నెలమ్మ తోడు రాగ
సన్నాయి మేళాలు
పందిట్లో మ్రోగంగ
అక్షింతలేసి
దీవించరండి
పల్లవి:
మాఘమాస వేళ వచ్చె
చిన్నదాన
మంచుపూల పల్లకే
నీకు తేనా
అహ...
మంచిరోజు చూసుకోని
పిల్లగాడ
మూడుముళ్ళు వేసుకోర
అందగాడా
దివిలోన మెరిసే తారలే
అక్షింతలవ్వగా
మ్రోగేటి మేళతాళమే
ఆ మెరుపే హాయిగా
అరె మేఘాల పెళ్ళిపందిరి
ఓ చిన్నదాన
నీకొరకు వేచి ఉన్నది
నీ వేలు నన్ను తాకగా
ఓ పిల్లగాడ
నా ఆశ మేలుకున్నది
చరణం 1:
కడిగినముత్యం మా పెండ్లికూతురూ
సద్గుణరాశి మా పెండ్లికూతురు
చక్కని చందమామ పెండ్లికొడుకూ
మనసుకు మారాజూ పెండ్లికొడుకు
తలపైన తలంబ్రాలు పోసుకున్నవేళలో
సంబరాలు అంబరాలు తాకుతున్నవమ్మడూ
వేదమంత్రాలతో ఏడడుగులేయగా
నీమీద నాప్రాణమయ్యింది పిల్లడూ
అరె కొమ్మమీది కోయిలమ్మ ఏమందీ
చక్కనైన జంట మనది అంటోంది
అరె విచ్చేటి పూలగాలి ఏమందీ
నిన్ను నన్ను చూసి మురిసిపోతోంది
నా పంచప్రాణాలను
ఓ చిన్నదాన
నీముందు ఉంచినానులే
అవి నాకంటి రెప్పచాటున
ఓ పిల్లగాడ
పదిలంగ దాచినానులే
చరణం 2:
కాటుకా కన్ను కలికి పెళ్ళికూతురా
నిన్నుచూస్తే కవితలెన్నో పుట్టుకొస్తు ఉన్నవే
మెరుపల్లె చొరవచేసి నన్ను నువ్వు చేరగా
గుండెలోన తియ్యని ఆశపుట్టుకొచ్చెరా
నీ మనసు చాటు మాట ఏమందీ?
నా కంటి దీపం నువ్వంది
హాయ్ గుప్పెడంత గుండె నీతో ఏమందీ
ఘడియైన నిన్ను వీడకంటోంది
ఆరె నీ నుదుట కుంకుమౌతనే
ఓ చిన్నదాన
నూరేళ్ళు తోడు ఉంటనే
ఎదలోనా నన్ను దాచుకో
ఓ పిల్లగాడ
గుండెలోన గూడు కట్టుకో