November 28, 2020

గోవర్దన గిరిధర గోవింద


గోవర్దన గిరిధర గోవింద 
రాగం: దర్బారి కానడ
కృష్ణం వందే జగద్గురుమ్
రచన: నారాయణతీర్థ
గానం: సుశీల 
 
పల్లవి:

గోవర్ధన గిరిధర గోవింద 
గోకులపాలక పరమానంద

అనుపల్లవి:

శ్రీవత్సాంకిత
శ్రీకౌస్తుభధర
భావకభయహర
పాహి ముకుంద॥

చరణం 1:

ఆనందామృత
వారిధిఖేల
అలఘుపరాక్రమ
అనుపమలీల
శ్రీనందాత్మజ
శ్రితజనపాల
శ్రీకరకిసలయ
లాలనలోల॥

చరణం 2

పాటితసురరిపు
పాదపబృంద
పావనచరిత
పరామృతకంద
నాట్యరసోత్కట
నానాభరణా...
నారాయణతీర్థార్చితచరణ॥