November 21, 2020

పాపా పేరు మల్లి


పాపా పేరు మల్లి
మౌనగీతం (1981)
రచన: ఆత్రేయ  
సంగీతం: ఇళయరాజా
గానం: జానకి, రాఘవులు 

పాపా పేరు మల్లి 
నా ఊరు కొత్త ఢిల్లీ 
పాపా పేరు మల్లి 
నా ఊరు కొత్త ఢిల్లీ
అర్ధరాత్రి కల్లో వచ్చి లేపి 
నా సంగీతం గొప్ప చూప మందోయ్
తంబురా శృతిలో 
మృదంగ గతిలో 
అహ...
తంబురా శృతిలో 
మృదంగ గతిలో
మందేసి పాడారా నాన్న 
పాపా పేరు మల్లి 
నా ఊరు కొత్త ఢిల్లీ

చరణం 1:

నాటుసారాతో శివమెత్తిపోతూ 
వాలుచూపు చూసే కుర్రదాన్ని చూస్తూ 

నాటుసారాతో శివమెత్తిపోతూ 
వాలుచూపు చూసే కుర్రదాన్ని చూస్తూ

సంగీతం పాడి పాడి అలిసా 
నే సరస్వతి పుత్రుడని అరిచా
మల్లికి నచ్చునని తలిచా 
గొంతు పొతే పోనీమని అరిచా

ఇంతోడి పాట యిన్నోళ్ళు అంతా 
శోషొచ్చి పోయారు 
పిల్ల వచ్చి నన్ను 
కిట్టూ భేషనీ అంటే 
ప్రాణమిస్తా 

పాపా పేరు మల్లి 
నా ఊరు కొత్త ఢిల్లీ

ఏంట్రా... తమ్ముళ్ళారా 
జాతకం ఫలించబోతుందని 
ఆశకొద్దీ పిల్ల కోసం 
దేవదాసులా గాలిస్తుంటే 
నా కష్టార్జితమంతా మీరే కాజేసి 
క్యాబరే ఆడతార్రా 

చాల్చాల్లే పోవయ్యా
 
ఏటదీ పోవయ్యా
అంత తిమ్మిరెక్కిపోయిందా...? 
ఏ...! తిక్కరేగిందంటే 
అబ్బాయని కూడా మర్చిపోయి 
నీకే తాళి కడ్తా భడవా... 

హ...

ఎగతాళా....! ఏడిపించకురా... 
వచ్చి నీ పని పడతా... 

యా......

చరణం 2:

యాడనైనను మీకొక జోడీ 
గాలమేసైనా పడతం రాజా 

హైసలగ్గ
నాకు జోడీ అంత 
అందమైన పిల్లుందా తమ్ముడూ 

అ... హ...

యాడనైనను నీకొక జోడీ 
గాలమేసైనా పడతం రాజా 
అట్టాగే లాక్కుని వస్తాం 
వచ్చి ఇట్ఠాగే లగ్గాన్ని పెడతాం 
కల్యాణమౌతాది నేడే 
అది కళ్ళారా చూస్తాము మేమే 
పెళ్ళైన రోజు నీకుంటారు 
పిల్లలు ముగ్గురయ్యా 

ఆ....

ఏటంటారు సయ్యంటారా 
చెప్పండి మహారాజా 

పాపా పేరు మల్లి 
నా ఊరు కొత్త ఢిల్లీ 
అర్ధరాత్రి కల్లో వచ్చి 
లేపి 
నా సంగీతం గొప్ప చూప 
మందోయ్
తంబురా  శృతిలో 
మృదంగ గతిలో
మందేసి పాడేరా నాన్న... 
పాపా పేరు... 
మర్చిపోయా... ?
నా ఊరు కొత్త... 
ఆ... హా.. హా... హా...