పాలగువ్వా
కాళరాత్రి (1980)
రచన: జాలాది రాజారావు
సంగీతం: ఇళయరాజా
గానం: బాలు, ఎస్.పి. శైలజ
కాళరాత్రి (1980)
రచన: జాలాది రాజారావు
సంగీతం: ఇళయరాజా
గానం: బాలు, ఎస్.పి. శైలజ
పల్లవి:
పాలగువ్వా...
ఇయ్యాలా ఉయ్యాలా
ఊగాలి రావమ్మా
బంగారుబొమ్మా మందారకొమ్మా
జాబిల్లిపువ్వా అందాలరవ్వా
పాలగువ్వా...
ఇయ్యాలా ఉయ్యాలా
ఊగాలి రావమ్మా
చరణం 1:
అల సన్నజాజి పందిరికింద
సందడి చేద్దామా...
కేరింతలేద్దామా...
అల మల్లెపూల దొంతులమీద
పానుపులేద్దామా...
వేడుకచేద్దామా...
ఎందెల్ల గారాలా
కన్నెర్ర కావాలా
గువ్వాగువ్వా నవ్వులు రువ్వి
గూడెక్కి పోవాలా
కొమ్మారెమ్మా అల్లికలాడి
నిన్నూ నన్నూ ముద్దాడాలా
చరణం 2:
నీ వయ్యారమ్మే ఉయ్యాలైతే
నిద్దురపోవాలా
ముద్దులు తీరాలా
నీ కళ్ళూ ఒళ్ళూ
ఇల్లైపోతే కాపురముండాలా
కోరిక పండాలా
ఏరై పొంగాలా
ఏడెక్కి పోవాలా
ఈడు జోడు కోడై కూస్తే
తెల్లారిపోవాలా
ఆ పొద్దూ ముద్దూ పంతాలాడే
కాళ్ళకు పారాణి దిద్దాలా
ముద్దులు తీరాలా
నీ కళ్ళూ ఒళ్ళూ
ఇల్లైపోతే కాపురముండాలా
కోరిక పండాలా
ఏరై పొంగాలా
ఏడెక్కి పోవాలా
ఈడు జోడు కోడై కూస్తే
తెల్లారిపోవాలా
ఆ పొద్దూ ముద్దూ పంతాలాడే
కాళ్ళకు పారాణి దిద్దాలా
చరణం 3:
అల ముద్దాబంతి బుగ్గలమీదా
తుమ్మెదనవ్వాలా
గుమ్మెత్తిపోవాలా
గుండె గుండె రాపిడిలోనా
గింజుకులాడాలా
నిను నంజుకుపోవాలా
కొండెక్కిపోవాలా
స్వర్గాలు చూడాలా
చుక్కలపల్లకి మబ్బుల్లోనే
ఊరేగిపోవాలా
మళ్ళీమళ్ళీ జన్మలొ కూడా
నువ్వూ నేనే జోడవ్వాలా