November 26, 2020

టక్కు టిక్కు టక్కులాడి


టక్కు టిక్కు 
బలిపీఠం (1975)
రచన: కొసరాజు 
సంగీతం: చక్రవర్తి 
గానం: బాలు, జానకి 

టక్కు టిక్కు టక్కులాడి బండిరా!
అబ్బో అబ్బో ఇది వట్టి మొండిరా!

టక్కు టిక్కు టక్కులాడి బండిరా!
అబ్బో అబ్బో ఇది వట్టి మొండిరా!

పొట్టి బండిరా
గట్టి బండిరా

పొట్టి బండిరా
గట్టి బండిరా 

మిడిసి పడుతుందిరా...

లెఫ్టు రైటు తెలియని డ్రైవరు 
సీటు మీద కూర్చుంటే కంగారు 
ముందు కనపడదు 
వెనుక వినపడదు
ముందు కనపడదు 
వెనుక వినపడదు
బుఱ్ఱ పనిచేయదూ.... 

టక్కు టిక్కు టక్కులాడి బండిరా 

ఏయ్...లెఫ్టు రైటు తెలియని డ్రైవరు

చరణం 1:

నొక్కుతుంటే దీని మోత చూడాలిరా 
పక్కవాళ్ళు హడిలి చచ్చిపోవాలిరా 
చిర్రుబుర్రు మంటుంది 
బిర్ర బిగుసు కుంటుంది 
చెప్పినట్టు వినకుందిరా 

చరణం 2:

కర్మగాలీ చేతగాని డ్రైవరుకు చిక్కావే 
ఈ జన్మకూ జాలి తలిచి సర్దుకోవే 
పోసుకోలు మాటలు 
పిచ్చిపిచ్చి పాటలు
పోసుకోలు మాటలు 
పిచ్చిపిచ్చి పాటలు 
కట్టిపెట్టమని చెప్పవే...

టక్కు టిక్కు తమాషాల బండిరా
బలేబలే మోటారు బండిరా...

సరదా బండిరా
జలసా బండిరా
సరదా బండిరా
జలసా బండిరా
జోరుగ పోతుందిరా.....