November 15, 2020

తాగుతా నీయవ్వ తాగుతా


తాగుతా నీయవ్వ తాగుతా 
డబ్బుకు లోకం దాసోహం (1973)
రచన: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం 
సంగీతం: కె.వి.మహదేవన్ 

పల్లవి:

తాగుతా నీయవ్వ తాగుతా
తాగుబోతు నాయాళ్ళ 
తల్లో దూరెళ్ళుతా 
తాగుతా నీయవ్వ తాగుతా
తాగుబోతు నాయాళ్ళ 
తల్లో దూరెళ్ళుతా 

తాగని నాకొడుకెందుకు లోకంలో 
సొర్గలోకమగపడతది మైకంలో 
తాగని నాకొడుకెందుకు లోకంలో 
సొర్గలోకమగపడతది మైకంలో 

చరణం 1:

దేవేంద్రుడు తాగాడు 
రంభతోటి ఆడాడు 
బలరాముడు చుక్కేసి 
బజార్లెంట పడ్డాడు
కాళిదాసు తాగితాగి 
కథలెన్నో పాడాడు 
తాగినోడికున్న తెలివి 
చెప్పడాని కెవిడికలివి?

చరణం 2:

తాటకి చాటుగ వచ్చి 
తాడిచెట్టు ఎక్కింది 
విశ్వామిత్రుడు తనకు 
లొట్టెడియ్యమన్నాడు 
మారీచుడు, సుబాహుడు 
మాకె చాలదన్నారు 
మహామహా వాళ్ళయినా 
మందులేంది బతకలేరు  
 
చరణం 3:

ఈ వాడకెల్ల పేరుబడ్డ రౌడీగాణ్ణి 
ఏయ్! కోపమొచ్చెనంటే చెడ్డ తప్పుడోణ్ణి 
ఎదురుచెప్పినోడి పీక నొక్కేస్తా 
గుంటలోన బెట్టి... గంట వాయిస్తా 

చరణం 4:

చిల్లిగవ్వకైన గూడ చెల్లనివాళ్ళు 
ఏసుకుంటె పెద్దమనుషులౌతారు 
(గవర్నమెంటు వాళ్ళుకూడా తాగమన్నారు 
డబ్బులొస్తే అదే మాకు చాలునన్నారు) 
అందుకే.... 
తాగుతా నీయవ్వ తాగుతా