టనానా టంకు ఛలో
నిత్య కల్యాణం పచ్చతోరణం (1960)
గానం: ఘంటసాల
సంగీతం: పెండ్యాల
రచన: ఆరుద్ర
నిత్య కల్యాణం పచ్చతోరణం (1960)
గానం: ఘంటసాల
సంగీతం: పెండ్యాల
రచన: ఆరుద్ర
రైటో..హా...
టనానా టంకు ఛలో
రాజా టంకు ఛలో...
టనానా టంకు ఛలో
రాజా టంకు ఛలో...
ఎద్దుబండి పాతదాయె
జటకా ఇరకాటమాయె
సైకిల్ తొక్కాలంటే
సత్తా కావాలోయి
బస్సుకోసం కాసుకుంటే
పనులు తుస్సుమంటాయోయ్
బస్సుకోసం కాసుకుంటే
పనులు తుస్సుమంటాయోయ్
రిక్షాబండీ మాత్రం
పైసా తక్కువలోనే జల్సా
జటకా ఇరకాటమాయె
సైకిల్ తొక్కాలంటే
సత్తా కావాలోయి
బస్సుకోసం కాసుకుంటే
పనులు తుస్సుమంటాయోయ్
బస్సుకోసం కాసుకుంటే
పనులు తుస్సుమంటాయోయ్
రిక్షాబండీ మాత్రం
పైసా తక్కువలోనే జల్సా
పుటకముందు కడుపులోన
తల్లి నిన్ను మోసింది
నడకరాని వయసులోన
నలుగురెత్తుకున్నారు
పెట్టిపుట్టినోళ్ళంటే
నడవలేని పసివోళ్ళే
పెట్టిపుట్టినోళ్ళంటే
నడవలేని పసివోళ్ళే
కలిగినోళ్ళు ఎపుడూ
తమ కాళ్ళమీద నిలబడరోయ్
ఎక్కినోళ్ళ ఎక్కువేంటి
మోసినోళ్ళ తక్కువేంటి
సాటివాడు లాగినపుడు
సవారీ అనుకోకోయ్
తోటిమనిషి సుఖాలకై
తోడుపడుట మంచిదోయ్
తోటిమనిషి సుఖాలకై
తోడుపడుట మంచిదోయ్
అంతా అందలమెక్కితే
అసలు మోసేదెవరోయి
టనానా......