November 26, 2020

కందిరీగతో చెప్పానురా


కందిరీగతో 
కక్ష (1980)
గానం: బాలు, సుశీల 
సంగీతం: చక్రవర్తి 
రచన: ఆత్రేయ 

పల్లవి:

కందిరీగతో చెప్పానురా 
బూరె కాదు బుగ్గ ఇది కుట్టవద్దనీ 
కుట్టినా ఎవ్వరికీ చెప్పొద్దని 
గోల చెయ్యొద్దని 
పరువు తీయొద్దని 

దొంగచాటుగా వస్తానులే 
బుగ్గమీద కాటేసి పోతానులే 
అడిగితే చెప్పుకో 
కందిరీగని... 
కాటు వేసిందని... 
బుగ్గ వాచిందని... 

చరణం 1:

ఉండుండి గుండె 
దడదడ మంటుందిరా 
ఆగాగి వయసు 
పెటపెట మంటుందిరా 

దాన్ని ఆపేది ఎట్టా 
దీన్ని అణిచేది ఎట్టా 

ఊగూగి మనసు 
రెపరెప మంటున్నదే 
ఉత్తుత్తినే ఒళ్ళు 
చిమచిమ లాడిందిలే 

దాన్ని తీర్చేది ఎట్టా 
దీన్ని ఆర్చేది ఎట్టా

చరణం 2:

కళ్ళల్లో నీకు ఇల్లొకటి కట్టానురా 
ఒళ్ళంత కళ్ళుగ నిన్నెదురు చూశానురా 

అద్దె ఇవ్వొద్దు నువ్వూ 
పొద్దుకోముద్దు ఇవ్వు 

పొద్దుకో ముద్దని పద్దెవరు వ్రాస్తారులే 
వద్దన్నకొద్దీ ముద్దెక్కు వౌతుందిలే 

నీకు నెలతప్పకుండా 
నేను అద్దిచ్చుకుంటా... 

కందిరీగతో చెప్పానురా....