వయసూ సొగసూ కలిసిన
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సిరివెన్నెల
నేపథ్య గానం: బాలు, సుశీల
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సిరివెన్నెల
నేపథ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
వయసూ సొగసూ కలిసిన వేళా
చేయీ చేయీ కలిపిన వేళా
ఒంపులు సొంపులు తెలిసే వేళా
ఒయ్యారాలు ఒలికే వేళా...
హాయిహాయిగా ఉంటుందీ...ఈ...
హాయిహాయిగా ఉంటుందీ
చరణం 1:
వీలుకాని గోల చేస్తే
గాలి ఆలకిస్తుంది
అయినవాళ్ళు గాని చూస్తే
లేనిపోని గొడవంది
ఊసుపోని కోరికేదో
వెంట తరుముకొస్తోంది
చేరదీసి ఊరడిస్తే
ఎంత పుణ్యమో అంది
కథ ముదరందే
కంచికి పొతే ఏం బాగుంటుందీ?
ముద్దుల ముచ్చట
హద్దులు మీరితే....
హాయిహాయిగా ఉంటుందీ...ఆ...
హాయిహాయిగా ఉంటుందీ
చరణం 2:
చేతనైతె చేదికందే
జాతివన్నె సొగసుంది
ఏరికోరి చేరికైతే
ఎందుకింత అలుసంది
ఆకుచాటు పిందెకింకా
పరువుకాని వగరుంది
ఆశరేగి కోసుకుంటే
కొమ్మతోటి తగువుంది
జత కుదిరాకా గుటకలు వేస్తే
ఏం బాగుంటుందీ?
పుట్టిన వేడుక
గుట్టుగ సాగితే
హాయిహాయిగా ఉంటుందీ...ఆ...
హాయిహాయిగా ఉంటుందీ