పచ్చిపాల ఒంటి
వారసుడొచ్చాడు (1988)
రచన: వెన్నెలకంటి
సంగీతం: ఇళయరాజా
గానం: శైలజ, చిత్ర
పల్లవి:
పచ్చిపాల ఒంటి ఈడు గిచ్చిపోమాక
ఇచ్చకాల ముల్లుచూపు గుచ్చిపోమాక
పచ్చిపాల ఒంటి ఈడు గిచ్చిపోమాక
ఇచ్చకాల ముల్లుచూపు గుచ్చిపోమాక
చిచ్చుపెట్టి చిచ్చికొట్టి తప్పుకోమాక
తప్పదింక మావయ్యో
హొయ్...తప్పు కాదు లేవయ్యో
మల్లెమొగ్గ లాంటి పిల్ల అల్లుకోమంది
బుగ్గలోన సిగ్గునిగ్గు గిల్లుకోమంది
ముగ్గులోకి దించి మత్తు జల్లుకోమంది
గోల గోలగున్నాది
నిన్ను జోలపాడమన్నాది
చరణం 1:
అందాలమామ నా చందమామ
తానాలకొచ్చావా...
మావయ్యో...
ఒళ్ళంత రుద్ది వయ్యారమద్ది
నీళ్ళోయమంటావా
చుక్కంటి పిల్ల సూదంటి నడుము
చుట్టేసుకోమంది
మావయ్యో....
చెక్కిళ్ళ తీపి నొక్కుళ్ళ మీదా ఒట్టేసుకోమంది
జోరుమీదుంది అసలే వయ్యారం
తీరిపోవాల కొసరే యవ్వారం
ఇక నీకే నా ముద్దుముడుపులు
నాకే నీ పట్టువిడుపులు
చరణం 2:
ఉయ్యాలలూగే వయ్యారి భామ
సయ్యాటకొచ్చింది
మావయ్యో....
తెల్లారిపోతే కిల్లాడి వయసు
చల్లారిపోతుంది
పిచ్చెక్కిపోయే పిందంటి సోకు
పండించుకుంటావా
మావయ్యో...
ముచ్చట్లు తీరే పందిట్లొ నాతో
దండేసుకుంటావా
సిగ్గు సింగారమిస్తా ఊ అంటే
లగ్గమెట్టించుకొస్తా సయ్యంటే
అరె వేసేయ్ ముత్యాలపందిరి
చేసేయ్ మురిపాల సందడి