December 4, 2020

ఓలమ్మి ఏమి చేతునే

 

శ్రీమతి కావాలి (1984)
సంగీతం: కృష్ణ-చక్ర 
గానం: బాలు, శైలజ  
రచన: గోపి 

పల్లవి:
 
ఓలమ్మి ఏమి చేతునే.... 
నాకు నీ మీద మనసు పోయెనే 

ఓరబ్బి ఏమి చేతురా.... 
సందె పొద్దయినా వాలలేదురా 

చిలక నవ్వుతో, కలువ కళ్ళతో 
రేపనీ మాపనీ గుబులురేపకే

కన్నపిల్లనీ కంట దాచుకో 
నచ్చితే గుండెలో దీపమెట్టుకో 
చరణం 1:

చూపుల్తో కబురంపమాక 
రేయంతా నిదరుండదే... 

చూపుల్తో కబురంపమాక 
నాకు రేయంతా నిదరుండదే... 

నను వీడి నువ్వు అడుగేస్తివా 
నాలోన క్షణమైనా ఉసురుండదే 

ఈ కథలు చెప్పేగా ఇంతచేస్తివి 
వద్దన్నా వెంటాడి కొంగుపడితివి 

చిట్టినడుముతో చిగురు పెదవితో 
ఆడుతూ, పాడుతూ ఆశ పెంచకే 

చరణం 2:

రేయెండవై నువ్వు రాగా  
పొగమంచు నేనైతిరా.... 

రేయెండవై నువ్వు రాగా 
పొగమంచు నేనైతిరా....

కన్నేసినా కాపైనది 
వగరైన నా పెదవి తీపైనది 

ఇస్తూనే లేదంటూ రెచ్చగొట్టకా
కౌగిలికి రాకుండా చిచ్చికొట్టకా 

అల్లరెందుకూ ఆగమెందుకూ 
ఆలినై జాలినై అలకతీర్చనా