November 26, 2020

తోముతాం


తోం తాం  
చిత్రం : నవ్వుతూ బ్రతకాలి (1975)
సంగీతం :  జి. కె. వెంకటేశ్
గీతరచయిత :  అప్పలాచార్య
నేపథ్య గానం : బాలు, జానకి

పల్లవి:

తోం తాం
తెగ తోం తాం
తకతకిట తోం తాం

తోం తాం
ఇస్తిరి తోం తాం
తోం తామిస్తిరి
తోం తాం

చరణం 1:

హరిలోరంగా
డ్రై క్లీనింగా
దులిపేసి, మడతేసి
ఇస్తాములే...

మేమిస్తాములే

చీరలైన, జాకెట్లైన,
లంగాలైన, బాడీలైన
తోం తాం

పంచెలైన, చొక్కాలైన,
లుంగీలైన, డ్రాయర్లైన
తోం తాం

బట్ట చిరిగినా
మడత నలిగినా
డబ్బులు వాపసు ఇచ్చేస్తాం
సిల్కును నైసుగ
పట్టును ఫైనుగ
ఖద్దరు ముద్దుగ రుద్దేస్తాం
తోం తాం

చరణం 2:

సమయానికి దగు
పాటపాడే...

పద పద...
గబ గబ....

కోట్లు తోమే నేను
కోర్టు దాటిన నువ్వూ

కోట్లు తోమే నేను
కోర్టు దాటిన నువ్వూ

చేరేదొకటే చోటుకి
అది కాటికి

వల్లకాటికి
చేరేదొకటే చోటుకీ...హా

తోం తాం
తళాంగుతాం

చరణం 3:

గోవిందా గోవిందా...
గోవిందా గోవిందా...

నువ్వటరా సోదరా..!
ఇదెక్కడి బాధరా....
చెంబులోన చెక్కుబుక్కున్నదే..
బ్యాంకులో ఎంత దాచావురా...?
ఈ చెంబు మీద పేరెవ్వరిదే..!
ఎవరింట తెచ్చావురా...ఆ..నాయనో...
చెప్పరా...

చెప్పను...

చెప్పరా...

చెప్పను...

మానవా...
ఓ మానవా...
ఈపని మానవా?

మానను నేనిక మానను

మానవూ...?

అలవాటైపోయింది
నేనేమి చేయనూ...
అయ్యో
నేనేమి చేయనూ...

మానను నేనిక మానను
ముష్టి మానను
ఇంక మానను
ముష్టి మానను
అంతే...

తోం తాం....